వయసుతో సంబంధం లేకుండా చాలా మంది డయాబెటీస్‌తో బాధ పడుతున్నారు. మధుమేహం లైఫ్‌లో ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం బాధ పడాల్సిందే. కాబట్టి ఆహారం ద్వారానే కంట్రోల్ చేసుకోవాలి. ఈ క్రమంలోనే కొన్ని అపోహలు వెంటాడుతూ ఉంటాయి.
డయాబెటీస్ ఉన్నవారు ఆహారాలు తీసుకోవడంలో సందేహిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టమాటాలు తింటే షుగర్ లెవల్స్ అనేవి పెరుగుతాయని అంటారు. మరి ఈ విషయంపై నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ వ్యాధితో బాధ పడేవారు ఎలాంటి సందేహం లేకుండా టమాటాలను తినవచ్చు. టమాటాలు ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే వీటిల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది.
టమాటాలు తింటే షుగర్ వ్యాధి అనేది కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా టమాటాలను తినవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. టమాటాలను తినడం వల్ల ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి.
కానీ మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ ఎలాంటి ఆహారం అయినా మితంగా తీసుకోవాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)