- Telugu News Photo Gallery Discover Pulichinta Aaku Health Benefits for Digestion And Respiratory Issues
Pulichinta Aaku Benefits: ఈ చిట్టి ఆకులతో కొండంత ఆరోగ్యం..! ఈ విషయాలు తెలిస్తే అవాక్కే..
ప్రకృతి మనకు పరిష్కారం కాదు అనుకున్న ఎన్నో అనారోగ్య సమస్యలకు నికార్సైన సమాధానం ఇస్తుంది. అందుకే మొక్కలో ఆ ఏముందిలే.. పిచ్చి మొక్కలు అనుకోకుండా వాటి ప్రయోజనాలేంటో తప్పక తెలుసుకోవాలి. అలాంటిదే పులి చింత ఆకు. చిన్నగా, గుండ్రటి ఆకులతో ఉండే ఈ మొక్క చూసేందుకు కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. పులి చింత ఆకును ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
Updated on: Oct 05, 2025 | 8:25 PM

పులి చింత.. దీనిని సంస్కృతం లో చాంగేరి అని పిలుస్తారు. దీని శాస్తీయ నామం ఆక్వాలీస్ కార్నిక్యులాట. ఆక్సాలిడేసి కుటుంబానికి చెందిన ఈ ఆకు కూర అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. దీని ఆకులు నమిలి తింటే పంటి భాధలు పిప్పళ్ల నొప్పి అన్నీ చింత లేకుండా మటుమాయం చేస్తుంది.

పులిచింత ఆకులతో శ్వాస సమస్యలను తొలగించడంతో పాటు నిద్రలేమి సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. కండరాలకు బలాన్నిస్తుంది. విరోచనాలు తగ్గటానికి ఆకుల రసాన్ని మజ్జిగలో కలిపి తాగాలని నిపుణులు చెబుతున్నారు. శ్వాస సమస్యలను దూరం చేస్తుంది.

సురిడుకాయలు తగ్గటానికి సున్నము తో లేదా సైంధవ లవణం తో పులిచింతాకు కలిపి నూరి అంటించి 5 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇలా ప్రతిరోజూ తగ్గెంతవరకు చేస్తూ ఉండాలి. తరచూ ఈ ఆకులను ఆహారంలో భాగంగా తింటే ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది.

పులి చింత ఆకులను మెత్తగా నూరి గాయాలకు పై పూతగా రాస్తే త్వరగా తగ్గుతాయి. తేలు కుట్టిన చోట సైంధవ లవణం చేర్చి ఈ ఆకులు పైన వేసి రుద్దితే తేలు విషం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని ఆకుల పచ్చడి ఆకలిని పెంచుతుంది.

పులి చింత వేళ్లను నీటిలో వేసి కాచి, ఆ కషాయంతో 10 నిమిషాల పాటు పుక్కిలిస్తే కదిలే దంతాలు గట్టి పడతాయి. ఈ తీగ జాతి మొక్క ఆకులు నమిలి తింటే పుల్లగా ఉంటాయి. పులి చింత ఆకులను ముద్దగా నూరి రసాన్ని ఫైల్స్ ఉన్నచోట రాసుకుంటే అవి త్వరగా రాలిపోతాయి.




