Spirituality Tips: వర్షం పడినట్టు కల వచ్చిందా.. దాని అర్థం ఇదే!
కలలో ఒక్కటే వస్తుంది అనడానికి ఏమీ లేదు. మనం ఊహించనవి.. అనుకోనివి కూడా కలలో వస్తూ ఉంటాయి. కొంత మందికి తరచూ ఒకే కల వస్తుంది. మరి కొంత మందికి మాత్రం వేరే కలలు వస్తాయి. ఆ కలలు మంచివైనా అయ్యి ఉండొచ్చు. అలాగే ఒక్కోసారి పీడ కలలు కూడా వస్తాయి. ఈ క్రమంలో కొంత మందికి కలలో పీడ కలలు కూడా వస్తాయి. అయితే మనం నిద్ర పోతున్నప్పుడు వచ్చే ప్రతి కలకి ఒక అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతుంది. మరి కలలో వర్షం పడితే.. దానికి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కలలో వర్షం పడుతున్నట్లు కల వస్తే అది శుభమని..
కలలో ఒక్కటే వస్తుంది అనడానికి ఏమీ లేదు. మనం ఊహించనవి.. అనుకోనివి కూడా కలలో వస్తూ ఉంటాయి. కొంత మందికి తరచూ ఒకే కల వస్తుంది. మరి కొంత మందికి మాత్రం వేరే కలలు వస్తాయి. ఆ కలలు మంచివైనా అయ్యి ఉండొచ్చు. అలాగే ఒక్కోసారి పీడ కలలు కూడా వస్తాయి. ఈ క్రమంలో కొంత మందికి కలలో పీడ కలలు కూడా వస్తాయి. అయితే మనం నిద్ర పోతున్నప్పుడు వచ్చే ప్రతి కలకి ఒక అర్థం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతుంది. మరి కలలో వర్షం పడితే.. దానికి అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కలలో వర్షం పడుతున్నట్లు కల వస్తే అది శుభమని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఇలా కలలో వర్షం పడుతున్నట్లు వస్తే.. దాని వల్ల మీ జీవితంలో ఆర్థిక సమస్యలు తొలగుతాయని.. త్వరలోనే కొత్త ఆదాయ వనరు అందుబాటులోకి వస్తుందని అర్థమట.
అలాగే తెల్ల ఏనుగు కలలో కనిపిస్తే.. అది రాబోయే మంచి కాలానికి మంచి సంకేతమట. ఈ కల వస్తే.. త్వరలోనే ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని, మీ అదృష్టాన్ని మారుస్తుందని స్వప్న శాస్త్రం చెబుతుంది.
అదే విధంగా కలలో దేవాలయాన్ని చూసినట్టు కానీ, వెళ్లినట్టు కానీ కల వస్తే.. చాలా శుభ ప్రదమని అర్థం. ఇలా కల వస్తే కుబేరుడి ఆశీర్వాదాలు మీపై ఉన్నట్లు స్వప్న శాస్త్రం చెబుతుంది. అంతే కాకుండా మీరు ఆర్థిక సమస్యల నుంచి బయట పడినట్లు సంకేతంగా భావించవచ్చు.
ఇక ఒక వ్యక్తి చెట్లు ఎక్కడం లేదా ఎత్తైన ప్రదేశానికి వెళ్లినట్టు కలలో వస్తే.. అది కూడా శుభప్రదం. ఇలా కల వస్తే మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారని అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా మీరు చేసే వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఇలా ఒక్కో కలకు ప్రత్యేకమైన అర్థాలు ఉంటాయి.