కొండల రాయుడికి వింత నైవేద్యం.. శరీరంపై తేళ్లను పాకించుకుంటున్న భక్తులు.. అలా ఎందుకు చేస్తున్నారంటే..?

| Edited By: Ram Naramaneni

Sep 05, 2023 | 1:21 PM

తేలు.. ఈ పేరు వింటేనే ఎవరికైనా భయమేస్తుంది. కనిపిస్తేనే పక్కకు జరిగిపోతారు ఎవరైనా,  ఎక్కడ అది తమను కరుస్తుందో అనే భయంతో. కానీ ఆ స్వామి భక్తులకు తేళ్లు అంటే ఏ మాత్రం భయం లేదు పైగా అభిమానం. అంతే కాదు ఆ తేళ్లని పట్టుకొని నదిలో తమ వీపుపై వేసుకొని సంచరించేలా చేసుకుంటారు. ప్రత్యేక శ్రావణ మాసం మూడవ సోమవారంలో ఈ తేళ్ల పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు అంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కొండపై తేలేను వెతికి పట్టుకొని ఒక దండలా చేసి ఆ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. చాలా వింతగా అనిపించే ఈ తేళ్ల పండుగను వివరాలను ఓ సారి చూద్దాం..

1 / 6
కర్నూలు జిల్లా: కోడుమూరు కొండపై వెలసిన కొండల రాయుడుకి తేళ్లతో నైవేద్యం పెట్టడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రతి సంవత్సరం శ్రావణమాసం మూడవ సోమవారం ఇక్కడ ప్రత్యేకత స్వామివారికి తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

2 / 6
తేళ్లను చేతుల పైన, తలపైన, ముఖం పైన, చివరికి నాలుక పైన పెట్టుకున్నా ఈ ఒక్కరోజు ఏమీ కాదు. తేళ్లు కుట్టినా గుడి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే చాలు నొప్పి మటుమాయం అవుతుందని స్థానిక భక్తులు చెబుతున్నారు.

3 / 6
ఈ తేళ్ల పండుగ వృత్తాంతం ఏమిటంటే.. 1970వ సంవత్సరం నాటికి కోడుమూరులో సౌరెడ్డి అన్నపూర్ణమ్మ దంపతులకు ముగ్గురు ఆడ సంతానమే. దీంతో తమకు మగ సంతానం కలిగితే స్వామికి గుడి కట్టించి తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తామని కొండల రాయుడుకి మొక్కుకున్నారు.

4 / 6
అనతి కాలంలో సౌరెడ్డి సతీమణి అన్నపూర్ణమ్మ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు మనోహర్ రెడ్డి అని నామకరణం చేయడంతో పాటు కోడుమూరు కొండల రాయుడికి కొండ పైన గుడి కట్టించారు.

5 / 6
ఇక అప్పటి నుండి కోడుమూరు నుండే కాకుండా జిల్లా నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చి తేళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. కోరిన కోరికలు తీరుతున్నాయని భక్తుల నమ్మకం.

6 / 6
ఇదిలా ఉండగా.. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో 3వ సోమవారం కొండల రాయుడుకి పూజలు నిర్వహించే సమయంలో ముందు రోజు గానీ అదే రోజు గానీ వర్షాలు తప్పకుండా కురుస్తాయి. నెల రోజులు వర్షం లేకున్నా.. స్వామివారిని పూజించిన వెంటనే ఈ రెండు రోజుల్లో వర్షాలు కురవడం విశేషంగా భావిస్తున్నారు భక్తులు..