చింత చిగురుతో ఇట్టా గానీ పచ్చడి పెట్టారంటే.. ఎంత కమ్మగుంటదో

Updated on: Mar 25, 2026 | 11:12 PM

chinta chiguru pachadi : చింత చిగురు పచ్చడి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మమ్మ కాలంలో అందరూ ఎగబడి మరి తినే వాళ్ళు. నాన్ వెజ్ కూరలు వచ్చాక వీటిని మర్చిపోయారు. ఇప్పుడు, దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం

1 / 5
చింత చిగురు తీసుకుని ఎండు మిరపకాయలతో వేయించి చేస్తే రుచి అదిరిపోతోంది. దీనిని ఆంధ్రాలో బాగా చేసుకుని తింటారు. ఇంకా పుల్లపుల్లగా కారంగా తినేకొద్ది తినాలనిపిస్తుంది. వేడి వేడి అన్నంలోకి అయితే అబ్బబ్బా అంటూ లొట్టలు వేసుకుంటూ తింటారు.

2 / 5

కావాల్సిన పదార్ధాలు : రెండు చింత చిగురు, 10 ఎండు మిర్చి,  అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్, అర టీ స్పూన్ ఆవాలు, 5 వెల్లుల్లి రెబ్బలు,  అర కప్పు నూనె, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు ఆకులు.

3 / 5
చింత చిగురును కడిగి శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టాలి.పాన్ లో ఆయిల్ వేసి  10 ఎండుమిర్చి, పప్పులు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. అదే పాన్ లో చింత చిగురు వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి.

4 / 5
ఇప్పుడు మిక్సీలో 10 ఎండుమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి వేసి, ఆ తర్వాత వేయించిన చింత చిగురు, నీళ్ళు కొద్దిగా వేసి చట్నీలా చేసుకోవాలి.  చివర్లో ఆవాలు, కరివేపాకు ఆకులు , 2 ఎండుమిర్చి కూడా వేసి తాలింపు పెట్టుకోవాలి.

5 / 5
దీనిని  వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతోంది. ఇంకా దీనిలో కొద్దిగా నెయ్యి వేస్తే చికెన్ మటన్ కూడా సరిపోవు. ఇంకా దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రోట్లో  కానీ లేదా మిక్సీలో కానీ రుబ్బుకుంటే సరిపోతోంది.

Follow Us