- Telugu News Photo Gallery Deeparadhana with coconut oil will get rid of all these problems, Check Here is Details
Deeparadhana: కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే.. ఈ సమస్యలు అన్నీ మాయం..
హిందూ సంప్రదాయంలో దీపారాధనకు చాలా ముఖ్య పాత్ర ఉంది. చాలా మంది నిత్య దీపారాధన అంటే ఉదయం, సాయంత్రం కూడా చేస్తూ ఉంటారు. మరికొంత మంది కేవలం శుక్ర, శని, పండుగ సమయాల్లో చేస్తారు. దీపారాధన చేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తారు. దీపారాధనకు వారి స్థోమత కొద్దీ కొబ్బరి నూనె, నువ్వుల నూనె, నెయ్యి వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా చాలా మంది కొబ్బరి నూనెను మాత్రమే..
Updated on: Oct 18, 2024 | 1:02 PM

హిందూ సంప్రదాయంలో దీపారాధనకు చాలా ముఖ్య పాత్ర ఉంది. చాలా మంది నిత్య దీపారాధన అంటే ఉదయం, సాయంత్రం కూడా చేస్తూ ఉంటారు. మరికొంత మంది కేవలం శుక్ర, శని, పండుగ సమయాల్లో చేస్తారు. దీపారాధన చేసి ఆ భగవంతుడిని ప్రార్థిస్తారు.

దీపారాధనకు వారి స్థోమత కొద్దీ కొబ్బరి నూనె, నువ్వుల నూనె, నెయ్యి వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా చాలా మంది కొబ్బరి నూనెను మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. కొబ్బరి నూనెతో ఎక్కువగా దీపారాధన చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.

ఇంట్లో తరచూ కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల శుభ కార్యాలు అనేవి జరుగుతాయట. రావి చెట్టు కింద ఉండే నాగ దేవతల విగ్రహాలకు, శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల స్వామి అనుగ్రహం త్వరగా లభిస్తుందట.

అదే విధంగా కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పోయి.. సంతోషంగా ఉంటారని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది.

40 రోజుల పాటు మహాలక్ష్మీ దేవికి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి.. పంచదార లేదా తీపి పదార్థాలు నూవేద్యంగా పెడితే ఇంట్లో ఎలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు, సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)




