
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం (DDS-KVK) ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంపై రెండు రోజుల జిల్లా స్థాయి సెమినార్ ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ యూసఫ్ గూడకు చెందిన ఎన్.ఐఎం.ఎస్.ఎం.ఈ (ni-msme) సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా.. రైతులు, మహిళలు, యువతకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు

ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. కెమికల్స్ వాడకం వల్ల తేనెటీగలు అంతరించిపోతు న్నాయని,ఇవి లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.రైతులకు, మహిళలకు, నిరుద్యోగ యువతీ యువకులకు తేనెటీగల పెంపకంపై అవగాహన, శిక్షణ కల్పించడమే లక్ష్యంగా డీడీఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో సరికొత్తగా ఎపి కల్చర్ యూనిట్‌ను ప్రారంభించారు.

పంటల్లో పరపరాగ సంపర్కాన్ని పెంచి దిగుబడిని పెంచడంతో పాటు, నాణ్యమైన తేనెను సేకరించేందుకు ఈ యూనిట్ ఎంతో దోహదపడనుంది.ఇందులో భాగంగా యూరోపియన్ జాతికి చెందిన 'ఏపీస్ మెళ్లీఫిరా', భారతీయ జాతికి చెందిన 'ఎపీస్ సెరాన' రకాల తేనెటీగల బాక్సులను శాస్త్రీయ పద్ధతిలో ఇక్కడ అమర్చారు.

తేనెటీగల పెంపకం ద్వారా కేవలం తేనె మాత్రమే కాకుండా..మైనం, పుప్పొడి (పోలెన్), రాజాహారం (రాయల్ జెల్లీ), ప్రొపొలీస్, తేనెటీగ ముల్లు యొక్క విషం (బీ వెనమ్) లాంటి ఎన్నో విలువైన ఉత్పత్తులను తయారు చేయవచ్చని బి-కీపర్ పరిపూర్ణ వివరించారు..వీటి ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చని తెలిపారు.

ఈ రెండు రోజుల జిల్లా స్థాయి సెమినార్‌లో KVK బృందంతో పాటు జహీరాబాద్ పరిసర ప్రాంతాల రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అవగాహన పెంపొందించు కున్నారు.రసాయనాల వాడకాన్ని తగ్గించి, తేనెటీగలను కాపాడుకుంటూ.. సబ్సిడీ పథకాల ద్వారా తేనెటీగల పెంపకాన్ని ఒక లాభసాటి ఉపాధి మార్గంగా మార్చుకోవాలని ఈ సదస్సు ద్వారా నిపుణులు పిలుపునిచ్చారు.