
వాకింగ్ గుండె సామర్థ్యాన్ని పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. శరీర జీవక్రియను సక్రియం చేస్తుంది. ఇది మాత్రమే కాదు ఇది కండరాలు, ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది.

ప్రతి వ్యక్తికి శారీరక శ్రమ అనేది చాలా అవసరం. కానీ ఈరోజుల్లో శారీక శ్రమ అనేది తగ్గిపోతుంది. దీంతో అనేక వ్యాధుల బారినపడి ఆసుపత్రిల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా అధిక బరువుతో జిమ్ సెంటర్లలోనే ఎక్కువగా గడుపుతున్నారు. అయితే ఎలాంటి సమస్యలకైనా సరే నడకే మంచి ఔషధం అంటున్నారు ఆరోగ్యనిపుణులు. నడవడం వలన ఎంత పెద్ద సమస్య అయినా త్వరగా తగ్గిపోతుంది. అందుకే తప్పకుండా ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలపాటు నడవాలని సూచిస్తుంటారు వైద్య నిపుణులు.

భోజనం తర్వాత ఉదయం, సాయంత్రం కనీసం ఇరవై నిమిషాలు నడవడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. మీరు ఇంట్లో కూడా ఇరవై నిమిషాలు వాకింగ్ చేయవచ్చు.

మార్నింగ్ వాకింగ్ మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. చాలా మంది రోజుకు 20 నుంచి 25 నిమిషాలు నడుస్తారు. వాకింగ్ శరీరాన్ని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది.

అదే విధంగా రోజుకు కనీసం ఏడు వేల అడుగులు నడిచే వారి ఆరోగ్యంకూడా చాలా బాగుంటుందంట. వీరికి గుండె జబ్బుల రిస్క్ 25 శాతం తక్కువగా, అలాగే టైప్ 2 డయాబెటిస్ రిస్క్ 14 శాతం తక్కువగా క్యాన్సర్ రిస్క్ 6%, డిప్రెషన్ రిస్క్ 22% తక్కువ ఉండే ఛాన్స్ ఉన్నదం. అందుకే ప్రతి వ్యక్తి తప్పకుండా ఏడు నుంచి ఏనమిది వేల అడుగులు నడవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.