
వాకింగ్: డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో వాకింగ్ ఎంతో దోహదం చేస్తుంది. రెగ్యులర్ గా వాకింగ్ చేయడం వలన గుండె పనితీరు మెరుగవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పైగా వాకింగ్ అనేది చాలా సులభమైన ఎక్స్‌ర్‌సైజ్. వాకింగ్ చేయడానికి ఎలాంటి సాధనాలు అవసరం లేదు. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇది కండరాలను స్ట్రాంగ్‌గా చేస్తుంది. బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది.

స్ట్రెంత్ ట్రైనింగ్: స్ట్రెంత్ ట్రైనింగ్ వలన కండరాలు బలంగా ఉంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపర్చడంలో ఇది ఎంతో దోహదం చేస్తుంది. శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. స్ట్రెంత్ ట్రెయినింగ్ లేదా రెసిస్టెన్స్ ట్రెయినింగ్ అంటే వెయిట్స్‌ని లిఫ్ట్ చేయడం. రెగ్యులర్‌గా వెయిట్ ట్రెయినింగ్ చేసే వాళ్ళకి హార్ట్ డిసీజ్, కాన్సర్ డెవలప్ అయ్యే రిస్క్ తక్కువగా ఉంటుందట.

స్విమ్మింగ్: ఇది ఒక అద్భుతమైన ఏరోబిక్ వ్యాయామం. ఇది మొత్తం శరీరానికి ఒకేసారి ఎక్సర్ సైజ్ అవుతుంది. అందుకే ఈత ఒక ఫుల్ బాడీ వర్కౌట్ అంటారు.. డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. దీని వలన గుండె పనితీరు మెరుగవుతుంది. ఈత కొట్టడం వల్ల శరీర కండరాలు బలపడతాయి. మీ శరీర ఫిట్‌నెస్ మెరుగుపడుతుంది. ఇది బరువును నియంత్రించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

సైక్లింగ్: సైక్లింగ్ చేయడం వలన గుండె పనితీరు మెరుగవుతుంది, కాళ్లు ధృడంగా ఉంటాయి. బ్లడ్ షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచడంలో ఇది ఎంతో దోహదం చేస్తుంది. సైకిల్ తొక్కడం వల్ల ఎముకలు, కండరాలు బలోపేతం అవుతాయి. నెలసరి నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులను తగ్గించడం, ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గించడం సైకిల్ తొక్కడం వల్ల కలిగే ఉపయోగాలు.

యోగా: యోగా చేయడం వలన ఫ్లెక్సిబిలిటీ మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగవుతాయి. యోగా చేయడం వల్ల శరీరానికి నూతనోత్సాహం కలుగుతుంది. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా వుండేట్లు చేస్తుంది. యోగా చేయడం వల్ల రక్తపోటు కూడా అదుపులో వుంటుంది. ఆరోగ్యకరమైన జీవితానికి యోగా ఎంతో సహాయపడుతుంది.