
జుట్టు మందంగా, పొడవుగా ఉండాలంటే ప్రత్యేక పోషణ అవసరం. పెరుగు మీ జుట్టుకు పూర్తి పోషణను అందిస్తుంది. పెరుగులో ఉసిరి పొడిని కలిపి జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. ఉసిరి పొడి పెరుగు హెయిర్ ప్యాక్ జుట్టు రాలడం సమస్యను దూరం చేస్తుంది.

జుట్టు సమస్యలను దూరం చేయడంలో ఉసిరి అద్భుత వరం అంటున్నారు నిపుణులు. జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఉసిరి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఉసిరితో తల వెంట్రుకలు ఒత్తుగా, బలంగా పెరుగుతాయి. అలాగే ఇది మీ జుట్టు నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. ఉసిరిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గడం నుంచి చుండ్రు పూర్తిగా తొలగిపోవడం వరకు ఉసిరి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది.

ఉసిరిపొడిని పెరుగుతో కలిపి హెయిర్ ప్యాక్‌లా వాడితే, క్రమంగా మీ జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. దీని వల్ల డాండ్రఫ్ దూరమై జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. ఇందుకోసం ఉసిరిపొడి, పెరుగు హెయిర్ ప్యాక్ కోసం 2 స్పూన్ల ఉసిరి పొడిని తీసుకుని, దానికి 3 స్పూన్ల పెరుగు వేసి బాగా కలపాలి. జుట్టు, తలపై ఈ హెయిర్ మాస్క్‌ను పూర్తిగా అప్లై చేయండి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే కొద్ది రోజుల్లోనే తేడా కనిపిస్తుంది. చుండ్రు సమస్య దూరమవుతుంది.

ఉసిరి, పెరుగును అప్లై చేయడం వల్ల మీ జుట్టు పాడైపోయినట్లయితే రిపేర్ చేయడం సులభం అవుతుంది. ఉసిరి, పెరుగు తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కూడా సాయపడుతుంది. ఇది కొన్ని రోజుల్లో మీ జుట్టు రాలడాన్ని ఆపివేస్తుంది. జుట్టు మూలం గట్టిపడుతుంది.

పెరుగు, ఉసిరి మిశ్రమం జుట్టు ఎదిగేందుకు తోడ్పడుతుంది. పెరుగులో చిట్లిపోయి, పాడైపోయిన వెంట్రుకలను రిపైర్ చేసి, పొడి జుట్టును తిరిగి యథాస్థితికి తీసుకొస్తుంది. పెరుగుతో పాటు ఉసిరి కాయ రసం జుట్టుకు పట్టించడం వల్ల ఈ బెనిఫిట్స్ పొందొచ్చు.