
పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు తింటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అలాగని మరీ ఎక్కువగా తినడం కూడా మంచిది కాదట. ముఖ్యంగా పెరుగు తింటే గట్ హెల్త్ మెరుగుపడుతుందని అంటుంటారు. పుల్లని పెరుగులో ప్రోబయోటిక్స్ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా ఉంటుంది.

ఇది శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపి, రోగనిరోధక శక్తిని పెంచుతుది. అలాగే పుల్లని పెరుగులో విటమిన్ ఎ, బి 6, బి కొవ్వు, కాల్షియం, ఫాస్పరస్‌తో సహా వివిధ పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. పుల్లటి పెరుగు శరీరంలో హానికరమైన వ్యర్థాలు పేరుకుపోకుండా నివారిస్తుంది.

శరీరంలోని అధిక రక్తపోటును నియంత్రించడమే కాకుండా జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. పుల్లని పెరుగు తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. అయితే ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెరుగును రోజూ తినకూడదు. బదులుగా మజ్జిగ తాగాలట. ఉప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలు పెరుగుతో కలిపి తీసుకుంటే ఎంతో ప్రయోజనకరం అని చెబుతున్నారు.

అలాగే అలర్జీ, దగ్గు, వాపు సమస్యలు ఉన్నవారు పెరుగు తినకపోవడమే మంచిది. పెరుగును ఎప్పుడూ వేడి వేడిగా తినకూడదు. పెరుగును వేడి చేయడం వల్ల పెరుగు నాణ్యత దెబ్బతింటుంది. కావాలంటే అల్పాహారం లేదా భోజనంలో పెరుగు తినవచ్చు. అయితే రాత్రిపూట పుల్లని పెరుగు తినకపోవడమే మంచిది. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. రోజుకు ఒకసారి పెరుగు తింటే మంచిది.

అందుకే రోజూ పెరుగు తినే అలవాటు మీకు ఉంటే దానిని వెంటనే మానేయడం బెటర్. లేదంటే మీ ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పెరుగు మాత్రమే తినకుండా, వీలైతే పెరుగులో వాల్‌నట్‌లు, జీడిపప్పు లేదా ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ కలిపి తినవచ్చు.