Cumin Water: జీలకర్ర నీరు బరువు తగ్గాలనునే వారికి ఓ వరం.. ఎలా తీసుకోవాలంటే..

|

Dec 09, 2024 | 7:23 PM

ఆరోగ్యాన్ని కాపాడుకుంటే వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. కనుక తినే ఆహారం విషయంలో కొన్ని నియమాలను పాటించాలి. బరువు పెరగకుండా ఉండాలంటే జీలకర్ర నీళ్లు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. అయితే రోజూ జీలకర్ర నీళ్లు తాగకూడదనుకునే వారు రకరకాలుగా జీలకర్ర నీటిని తయారు చేసుకోవచ్చు. కనుక ఈ రోజు జీలకర్ర నీటిని ఎందుకు త్రాగాలి? ఎలా తాగాలి? ఎప్పుడు తాగాలి ఈ రోజు తెలుసుకుందాం..

1 / 11
మారిన జీవన విధానంతో ఆరోగ్యంగా ఉండటం, వివిధ వ్యాధులకు దూరంగా ఉండటం సవాలుతో కూడుకున్న పని.  కనుక కొన్ని మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు. ప్రస్తుతం చిన్న పెద్ద ఎదుర్కొంటున్న సమస్య బరువు పెరగడం. దీంతో వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. కనుక బరువు తగ్గించుకోవడం ద్వారా వ్యాధుల ముప్పును తగ్గించుకోవాలి. బరువు పెరగకుండా ఉండాలంటే జీలకర్ర నీళ్లు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. అయితే రోజూ జీలకర్ర నీళ్లు తాగకూడదనుకునే వారు జీలకర్ర నీటిని వివిధ రూపాల్లో ప్రయత్నించవచ్చు.

2 / 11
జీలకర్ర నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు: యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే జీలకర్ర నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

3 / 11
Cumin Water

Cumin Water

4 / 11
జీర్ణక్రియలో సహాయపడుతుంది: ఎప్పుడైనా భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరంగా ఉన్నట్లతే జీలకర్ర నీరు ఈ సమస్యను పరిష్కరిస్తుంది. ఉబ్బరం, మలబద్ధకాన్ని నివారించడానికి ప్రతిరోజూ ఒక కప్పు జీలకర్ర నీరు త్రాగడానికి ప్రయత్నించండి.

5 / 11
శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది: సులభమైన, సమర్థవంతమైన డిటాక్స్ డ్రింక్ కోసం చూస్తున్నట్లయితే జీరా వాటర్‌ని ప్రయత్నించండి. ఇది టాక్సిన్స్‌ను ప్రభావవంతంగా బయటకు పంపుతుంది, బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది.

6 / 11

కడుపులో మంటను తగ్గిస్తుంది: జీలకర్ర నీరు శరీరంలో మంటను తగ్గిస్తుంది.  పొట్టలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. జీలకర్ర నీరుని తయారు చేయడం సులభం.. ఒక గాజు గ్లాసు నీటిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టండి. ఆ నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి.

7 / 11
నిమ్మకాయతో జీలకర్ర నీరు: నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది కొవ్వును కరిగించే లక్షణాలను పెంచుతుంది. ముందుగా పైన చెప్పిన విధంగా జీలకర్ర నీటిని సిద్ధం చేసుకోవాలి. తాగే ముందు సగం నిమ్మకాయను పిండాలి. ఇలా చేయడం వల్ల అనవసర కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.

8 / 11

తేనెతో జీలకర్ర నీరు: తేనె జీర్ణక్రియలో సహాయపడుతుంది. తీపి తినాలనే కోరికలను అరికడుతుంది. దీన్ని తయారు చేయడం చాలా సులభం. ముందుగా గోరువెచ్చని జీలకర్ర నీటిలో 1 స్పూన్ తేనె కలపండి. ఉదయం ఖాళీ కడుపుతో తాగండి

9 / 11
జీలకర్ర, అల్లం నీరు: అల్లం జీవక్రియను పెంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. 1 టీస్పూన్ జీలకర్ర , ఒక చిన్న తురిమిన అల్లం ముక్కను నీటిలో వేసి మరగనివ్వండి. ఈ నీటిని గోరు వెచ్చగా త్రాగండి. బరువు తగ్గడానికి ఈ నీరు మంచి ఎంపిక.

10 / 11
బరువు తగ్గడానికి జీలకర్ర టీ: జీలకర్రను టీ మసాలాలతో కలిపి తాగవచ్చు. ముందుగా వేడినీటిలో జీలకర్ర, చిటికెడు దాల్చిన చెక్క, సోంపు వేయాలి. దీనిని హెర్బల్ టీగా ఆస్వాదించండి.

11 / 11
జీలకర్ర నీరు ఎప్పుడు తాగాలంటే.. బరువు తగ్గాలనుకుంటే ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగండి. ఇది ఆకలిని తగ్గించేందుకు సహాయపడుతుంది. భోజనానికి ముందు కూడా జీరా నీటిని త్రాగవచ్చు. జీర్ణక్రియకు సహాయపడటానికి భోజనం తర్వాత జీలకర్ర నీటిని తీసుకోవచ్చు. ఉత్తమ ఫలితాలను పొందడానికి జీరా వాటర్‌తో పాటు సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం. అలాగే తినే ఆహారంలో చక్కెరను చేర్చుకోవడం మనుకోవాల్సి ఉంటుంది. గరిష్ట ప్రయోజనాలను పొందడానికి ప్రతిరోజూ తాజా తయారు చేసిన జీలకర్ర నీటిని త్రాగడానికి ప్రయత్నించండి.