
కీర దోసకాయలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. కీరదోసను తినాలని నిపుణులు చెబుతుంటారు. ఎండాకాలంలో కీర దోసకాయను తింటే.. శరీరానికి చలువ చేసి, హైడ్రేషన్‌ను పెంచుతుంది. ఇందులో 95శాతం నీరు ఉంటుంది. అంతేకాకుండా.. విటమిన్ K, C, పొటాషియం, మెగ్నీషియం వంటి అద్భుతమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కీర దోసలో తక్కువ కేలరీలు ఉండటంతోపాటు.. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.. ఇది ఎన్నో సమస్యలకు దివ్యౌషధమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కీర దోసకాయను సాధారణంగా సలాడ్‌లలో ఉపయోగిస్తారు.. కానీ ఇది కేవలం సలాడ్ పదార్థం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. వేసవికాలంలో దీని ప్రాముఖ్యత మరింత పెరుగుతుందని.. పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. కీర దోసకాయలను రెగ్యులర్ గా తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు..

కీర దోసకాయలో 90శాతం నీరు - అధిక ఖనిజ లవణాలు ఉంటాయి. ఇది శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసి, డీహైడ్రేషన్ నుండి తక్షణ ఉపశమనం అందిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే పొటాషియం అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర నెమ్మదిగా విడుదలవుతుంది, తద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది.

జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో, జీర్ణశక్తిని పెంపొందించడంలో కీర దోసకాయ కీలక పాత్ర పోషిస్తుంది.అంతేకాకుండా బరువును తగ్గించడంలో కూడా కీలక పాత్రపోషిస్తుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. చర్మానికి మెరుపునిచ్చే మెగ్నీషియం వంటి పోషకాలు ఉండటం వల్ల దీనిని సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు.

కీరా దోసలోని యాంటీ ఆక్సిడెంట్లు రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లను నివారించడంలో తోడ్పడతాయి. ఇది ఒక మంచి డిటాక్సిఫైయింగ్ ఏజెంట్‌గా పనిచేసి, శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది. కాలేయం, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి, గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కీర దోసకాయలను రెగ్యులర్ గా మీ ఆహారంలో భాగం చేసుకోండి.. దీని ద్వారా ఈ ప్రయోజనాలను పొందవచ్చు.. ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా..? లేక సందేహాలున్న వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.