
చేపల మారినేషన్: ముందుగా చేప ముక్కలను బాగా కడిగి, నీరు లేకుండా ఆరబెట్టాలి. ఒక బౌల్‌లోకి తీసుకుని పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి, కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ ముక్కలకు మసాలాలన్నీ బాగా పట్టించి 10 నిమిషాలు పక్కన పెట్టాలి.

ఉల్లిపాయ కాల్చడం: ఉల్లిపాయలకు ఫోర్క్ స్పూన్ గుచ్చి, స్టవ్ మంటపై నేరుగా కాల్చుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసేసి, ముక్కలుగా కోసి, మిక్సీ జార్‌లో వేసి బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

చేపల ఫ్రై: స్టవ్ ఆన్ చేసి కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. మ్యాగీనేట్ చేసిన చేప ముక్కలను వేసి, రెండు వైపులా 3-4 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.

ఉల్లి కారం తయారీ: అదే నూనెలో మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించాలి. ఆ తర్వాత కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి మరియు వేయించిన ఆవ-మెంతి పిండి వేసి బాగా కలపాలి. మసాలా నుండి నూనె పైకి తేలేంత వరకు మంటను సిమ్‌లో ఉంచి మగ్గించాలి.

ఫినిషింగ్ టచ్: మసాలా బాగా వేగిన తర్వాత, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలను అందులో వేసి మూత పెట్టాలి. లో-ఫ్లేమ్‌లో 5 నిమిషాలు మగ్గనిచ్చి, ఆపై ముక్కలు విడిపోకుండా నెమ్మదిగా రెండో వైపు తిప్పి మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి.