మీ కాఫీని మరింత హెల్తీగా మార్చే సూపర్‌ సీక్రెట్‌.. రుచి అదిరిపోద్ది

05 June 2026

TV9 Telugu

TV9 Telugu

కప్పు కాఫీ తాగనిదే చాలామందికి రోజు మొదలు కాదు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి.. బద్ధకాన్ని వదిలించుకోవడానికి.. తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి.. ఇలా సందర్భం ఏదైనా కాఫీ నీళ్లు గొంతు తడపాల్సిందే

TV9 Telugu

అయితే కాఫీని రోజు మాదిరి కాకుండా కాస్త విభిన్న రుచిలో తాగాలనుకునే వారికి ఈ చిట్కా భలే పనిచేస్తుంది. వంటగదిలోని ఈ చిన్న వస్తువు మరిగించే కాఫీలో వేస్తే రుచి రెట్టింపు అవడంతోపాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు

TV9 Telugu

వంటలకు రుచిని పెంచే దాల్చిన చెక్క.. ఇది కూడా కాఫీకి రుచి, సువాసనను జోడించడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను అందించే పదార్థంగా గుర్తింపు పొందింది

TV9 Telugu

కాఫీలో చిటికెడు దాల్చిన చెక్క పొడిని కలపడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్పందన మెరుగుపడే అవకాశం ఉంటుంది

TV9 Telugu

దీంతో గ్లూకోజ్‌ను శరీరం మరింత సమర్థంగా వినియోగించుకోగ‌లుగుతుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంద‌ట

TV9 Telugu

అయితే ఈ పదార్థాలను కాఫీలో చేర్చడం వల్ల కొన్ని ప్రయోజనాలు లభించే అవకాశం ఉన్నప్పటికీ, అవి ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలి

TV9 Telugu

సమతుల ఆహారం, క్రమమైన వ్యాయామం, తగిన నిద్రతోపాటు కాఫీని పరిమిత మోతాదులో తీసుకోవడం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది

TV9 Telugu

చిన్న మార్పులతోనే ప్రతిరోజూ తాగే కాఫీని మరింత పోషకవంతంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరూ రేపట్నుంచి ఇలా తాగేయండి