ఎందుకంటే, టీమిండియా టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉండగా, వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. వీరిద్దరూ హార్దిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్‌కు ఆడబోతున్నారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే రోహిత్ శర్మ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్సీపై సూర్యకుమార్ యాదవ్ కన్నేశాడు. అయితే, హార్దిక్ పాండ్యను కొత్త కెప్టెన్‌గా ప్రకటించగానే, సూర్యకుమార్ యాదవ్ ముంబై కొత్త కెప్టెన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. అయితే, సూర్య ఐపీఎల్ సీజన్ 17లో ముంబై ఇండియన్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, రాబోయే సీజన్ కోసం మెగా వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే.