Virat Kohli: అసలు విరాట్‌కు ఏమైంది? తల ఎత్తుకోలేకపోతున్న కింగ్ ఫ్యాన్స్..

|

Dec 31, 2024 | 6:14 PM

విరాట్ కోహ్లీ ఈ ఏడాది మొత్తం 23 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. విరాట్ 32 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి 655 పరుగులు మాత్రమే చేశాడు. 2024లో కోహ్లీ 21.83 సగటుతో పరుగులు మాత్రమే చేశాడు. ఇటీవలే ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే.

1 / 6
విరాట్ కోహ్లీకి 2024 సంవత్సరం కలిసి రాలేదని చెప్పవచ్చు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ గెలవడం ద్వారా కింగ్ కోహ్లీ తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకున్నాడు. అయితే ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా కోహ్లీ ప్రదర్శన అంతగా ఏమి లేదు. ఒక్కసారి కోహ్లీ గణాంకాలు చూద్దాం..

2 / 6
 విరాట్ కోహ్లీ ఈ ఏడాది మొత్తం 23 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అతను 32 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. కానీ కోహ్లి ఒక్కటే సెంచరీ చేశాడు. కేవలం 2 సార్లు మాత్రమే అర్ధశతకాలు దాటాడు.

3 / 6
 ఈ ఏడాది 10 టెస్టు మ్యాచ్‌లు ఆడి 19 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 673 బంతుల్లో 417 పరుగులు చేశాడు. అది కూడా కేవలం 24.52 సగటుతో, కేవలం ఒక సెంచర, ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. విరాట్ పదర్శన అంతగా పెద్దగా చెప్పుకొద్దగా ఏమి లేదు..

4 / 6
విరాట్ కోహ్లీ 2024లో కేవలం 3 వన్డేల్లో మాత్రమే కనిపించాడు. ఈసారి 58 పరుగులు మాత్రమే వచ్చాయి. అంటే అతను 19.33 సగటుతో మాత్రం స్కోర్ చేశాడు. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధ సెంచరీ కూడా విరాట్ చేయకపోవడం గమనార్హం.

5 / 6
అలాగే ఈ ఏడాది టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 10 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 9 మ్యాచ్‌ల్లోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. కానీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో 76 పరుగులు చేసి భారత జట్టు ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ ఏడాది కోహ్లీ 10 టీ20 మ్యాచ్‌ల్లో 18 సగటుతో 180 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

6 / 6
విరాట్ కోహ్లీ గణాంకాలు చూస్తే.. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఈ పేలవ ప్రదర్శనతో 2024కి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ.. 2025లోనైనా ఫామ్‌లోకి వచ్చి బ్యాట్‌తో పరుగులు చేస్తాడో లేదా అనేది చూడాలి మరీ..