- Telugu News Photo Gallery Cricket photos Virat kohli emotional after india won by 4 wickets vs pakistan in t20 world cup 2022
Virat Kohli: ఒకవైపు ఒత్తిడి, మరోవైపు భావోద్వేగం.. కింగ్ ‘క్లాస్’ ఇన్నింగ్స్.. హాట్ టాపిక్‌గా మారిన విరాట్ ‘వెర్షన్ 2.0’..
T20 World Cup 2022: ఈ సమయంలో విరాట్ కోహ్లి విభిన్న స్టైల్స్‌తో కనిపించాడు. టీమ్ ఇండియా ఒత్తిడిలో ఉన్నప్పుడు, విరాట్ కోహ్లీ కొంత డిఫెన్స్ మోడ్‌లో కనిపించాడు.
Updated on: Oct 24, 2022 | 1:29 PM

గత ఏడాది కాలంగా ఎదురుచూసిన ఈ మ్యాచ్ ఎట్టకేలకు ఆదివారం అంటే అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌లోని చారిత్రక మైదానంలో జరిగింది. ఇక్కడ జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి టీమిండియా చరిత్ర సృష్టించింది. క్లిష్ట పరిస్థితుల్లో టీమిండియాను గెలిపించిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో హీరోగా నిలిచాడు.

మెల్‌బోర్న్‌లోని ఈ మైదానంలో విరాట్ కోహ్లీ 82 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి 4 సిక్సర్లతో పాటు 6 ఫోర్లు కూడా బాదాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు టీమ్ ఇండియా చాలా ఒత్తిడిలో ఉంది. కానీ, హార్దిక్ పాండ్యాతో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి, భారత శిబిరంలో ఆవలు నిలిపాడు.

ఈ సమయంలో విరాట్ కోహ్లి విభిన్న స్టైల్స్‌తో కనిపించాడు. టీమ్ ఇండియా ఒత్తిడిలో ఉన్నప్పుడు, విరాట్ కోహ్లీ కొంత డిఫెన్స్ మోడ్‌లో కనిపించాడు. ఇంతలో, హార్దిక్ పాండ్యా దూకుడిగా బ్యాటింగ్ మొదలుపెట్టాడు. దీంతో విరాట్ క్రీజులో స్థిరపడటానికి కొంత సమయం దొరికింది.

మ్యాచ్ చివరి ఓవర్‌కు చేరుకోవడంతో భారత్ తన పట్టును పటిష్టం చేసుకుంది. అప్పుడు విరాట్ కోహ్లి ఉత్సాహంగా కనిపించాడు. అతను ఇక్కడ బౌండరీ కొట్టిన వెంటనే గాలిలో పంచ్ చేసి, తన ఒత్తిడికి ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. చివరి వరకు క్రీజులో ఉండడంతో అభిమానులకు భరోసా అందిచాడు. దీని తర్వాత టీమ్ ఇండియా గెలవగానే విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

మొదట ఆనందంతో చాలాసేపు పరుగెత్తాడు. ఆ తర్వాత నేలపై కూర్చుని నేలపై పంచ్‌లు ఇచ్చేశాడు. విరాట్ కోహ్లీ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ నిలబడి ఉండగా, కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చి అతనిని తన భుజాలపైకి ఎత్తుకున్నాడు.

ఈ సమయంలో, విరాట్ కోహ్లీ ఇతర ఆటగాళ్లను కౌగిలించుకుంటూ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. విరాట్ కోహ్లి పదేపదే దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. అనంతరం విరాట్ మాట్లాడుతూ, ఈ రోజు తన వద్ద మాటలు లేవని చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 159 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా టీమిండియా చివరి బంతికి లక్ష్యాన్ని చేధించింది. విరాట్ కోహ్లీ 82 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతనితో పాటు హార్దిక్ పాండ్యా కూడా 40 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి భాగస్వామ్యం భారత్‌ను విజయపథంలోకి నడిపించింది.




