
Champions Trophy 2025: 14,000 వన్డే పరుగులు సాధించిన అత్యంత వేగవంతమైన ఆటగాడిగా టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్‌లో జరుగుతోన్న భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో 14,000 పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు.

సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న మూడవ బ్యాట్స్‌మన్, రెండవ భారతీయుడిగా కోహ్లీ నిలిచాడు.

కోహ్లీ తన 287వ ఇన్నింగ్స్‌లో 14,000 పరుగుల మార్కును చేరుకున్నాడు. టెండూల్కర్ 350 ఇన్నింగ్స్‌ల రికార్డును అధిగమించాడు. శ్రీలంకకు చెందిన కుమార్ సంగక్కర 378 ఇన్నింగ్స్‌లలో ఈ మార్కును చేరుకున్నాడు.

వన్డేల్లో 14,000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌లు ఎవరో ఓసారి చూద్దాం. 1) సచిన్ టెండూల్కర్ - 452 ఇన్నింగ్స్‌లలో 18,426 పరుగులు. 2) కుమార్ సంగక్కర - 380 ఇన్నింగ్స్‌లలో 14234 పరుగులు. 3) విరాట్ కోహ్లీ - 287 ఇన్నింగ్స్‌లలో 14000** పరుగులు