- Telugu News Photo Gallery Cricket photos Vinod Kambli offered help by Kapil Dev but with one condition, know what it is
Vinod Kambli- Kapil Dev: సచిన్ దోస్త్‌కు సాయం చేస్తా.. కానీ, ఓ కండీషన్: కపిల్ దేవ్
Vinod Kambli- Kapil Dev: సచిన్ టెండూల్కర్ జాన్ జిరిగి దోస్త్ వినోద్ కాంబ్లి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తాజాగా ఓ వేడుకలో కనిపించిన వినోద్ కాంబ్లి పరిస్థితిని చూసి చాలామంది జాలీ పడ్డారు. ఈ క్రమంలో వినో ద్ కాంబ్లీ శస్త్ర చికిత్సకు అయ్యే ఖర్చును భరీస్తానని టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ చెప్పుకొచ్చారు. కానీ, అందుకు ఓ కండీషన్ పెట్టారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Dec 06, 2024 | 4:46 PM

చిన్ననాటి స్నేహితులు సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ ఇటీవల ఇదే కార్యక్రమంలో కలుసుకున్న సంగతి తెలిసిందే. వినోద్ కాంబ్లీని సచిన్ టెండూల్కర్ కలుసుకుని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే.

వినోద్ కాంబ్లీ పరిస్థితి ప్రస్తుతం మరింత దిగజారినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో, 1983 ప్రపంచకప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ తాజాగా కాంబ్లీకి సహాయం చేసేందుక సిద్ధంగా ఉన్నాడు.

మద్యానికి బానిసై అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వినోద్ కాంబ్లీ ఆర్థికంగా కూడా కుంగిపోయాడు. దీంత్ సరైన వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేని పరిస్థితికి చేరుకున్నాడు. ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఇదే మొదటిసారి కానే సంగతి తెలిసిందే.

సచిన్-కాంబ్లీ మధ్య జరిగిన భేటీ వీడియోలో వినోద్ కాంబ్లీ లేచి నడవలేకపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మాటలు తడబడుతున్నాయి. చేతులు, కాళ్లు బలం కోల్పోయినట్లు తెలుస్తోంది. అందుకే వినోద్ కాంబ్లీకి సాయం చేస్తానని టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేశ్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ అందుకు ఓ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. వినోద్ కాంబ్లీ ట్రీట్‌మెంట్ తీసుకోవాలంటే, తాగుడు మానేయాలని కోరాడంట. అప్పుడే, కాంబ్లి చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని కపిల్ చెప్పాడంట.




