IND vs ENG: ఇంగ్లాండ్ టూర్‌కు భారత జట్టు.. కోహ్లీ, హార్దిక్‌తో పాటు ఆ ఐదుగురు రీఎంట్రీ.. నలుగురిపై వేటు?

Updated on: Jun 16, 2026 | 7:37 PM

India vs England ODI series 2026: భారత క్రికెట్ అభిమానులకు అసలైన మజా షురూ కానుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్ ముగిసిన వెంటనే టీమ్ ఇండియా ఇంగ్లాండ్ గడ్డపై సవాల్‌కు సిద్ధమవుతోంది. మిషన్ 2027 వన్డే ప్రపంచకప్ వేటను అధికారికంగా ప్రారంభించేందుకు బీసీసీఐ సరికొత్త వ్యూహాలతో 16 మంది సభ్యుల పటిష్టమైన జట్టును సిద్ధం చేస్తోంది.

1 / 5
India vs England ODI series 2026: ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ జూన్ 20తో ముగియనుంది. ఆ వెంటనే జులై నెలలో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. జులై 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి వన్డే, జులై 16న సోఫియా గార్డెన్స్‌లో రెండో వన్డే, ఇక క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ మైదానంలో జులై 19న ఆఖరి వన్డే జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్‌తో పోలిస్తే ఇంగ్లాండ్ స్వదేశంలో అత్యంత ప్రమాదకరమైన జట్టు కాబట్టి, ఈ సిరీస్‌ను భారత సెలెక్టర్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.

2 / 5
కింగ్ కోహ్లీ, బుమ్రా రీఎంట్రీ.. ఐదుగురు స్టార్స్ వస్తున్నారు..: ప్రస్తుత సిరీస్‌లో విశ్రాంతితోపాటు గాయాల కారణంగా దూరమైన కీలక ఆటగాళ్లు తిరిగి ఇంగ్లాండ్ సిరీస్‌తో జట్టులోకి రానున్నారు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టులోకి రావడం ఖాయమైంది. వీరితో పాటు ప్రపంచ అత్యుత్తమ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తిరిగి బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నాడు.

3 / 5
మరోవైపు, స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, గాయం నుంచి కోలుకుని దేశవాళీలో అదరగొడుతున్న యువ పేసర్ హర్షిత్ రాణా కూడా జట్టులోకి రానున్నారు. అలాగే, లిస్ట్-ఎ క్రికెట్‌లో 50 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక సగటు కలిగిన రికార్డు సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌కు కూడా సెలెక్టర్లు లండన్ విమానం ఎక్కించేందుకు మొగ్గు చూపుతున్నారు.

4 / 5
ఆ నలుగురిపై వేటు.. ఇంగ్లాండ్ టూర్‌కు దూరం..: భారత సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి వస్తుండటంతో, ప్రస్తుతం ఆఫ్ఘన్ సిరీస్‌లో ఆడుతున్న నలుగురు ఆటగాళ్లకు ఇంగ్లాండ్ టూర్‌లో చోటు దక్కడం కష్టంగా మారింది. విరాట్ కోహ్లీ స్థానంలో వచ్చిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు ఈసారి జట్టులో చోటు దక్కకపోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా రాకతో యువ పేసర్లు ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలపై వేటు పడనుంది. అలాగే, అక్షర్ పటేల్ జట్టులోకి వస్తుండటంతో హర్ష్ దూబే కూడా తన స్థానాన్ని కోల్పోవలసి వస్తుంది.

5 / 5
ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు భారత్‌ జట్టు అంచనా (16 మంది సభ్యులు): శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్.

Follow Us