- Telugu News Photo Gallery Cricket photos Team India Player Sanju Samson Selected Instead Of KL Rahul for Afghanistan T20I Series
IND vs AFG: పొట్టి ఫార్మాట్‌లో పేలవం.. కట్‌చేస్తే.. ఆఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన టీమిండియా ప్లేయర్..
Team India: ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కేఎల్ రాహుల్‌కు బదులుగా సంజూ శాంసన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యాడు. కానీ, టీ20 క్రికెట్‌లో శాంసన్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. దీంతో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సంజూ శాంసన్ కంటే కేఎల్ రాహుల్ పొట్టి ఫార్మాట్‌లో అద్భుతంగా ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి సమయంలో కేఎల్ రాహుల్‌ను పక్కన పెట్టడం ఏంటంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Updated on: Jan 09, 2024 | 12:14 PM

అఫ్గానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు టీమిండియా ఎంపికపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌ను పక్కనపెట్టడంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాహుల్ కంటే పేలవ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఎంపిక చేయడమే ఇందుకు ప్రధాన కారణం.

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కేఎల్ రాహుల్‌కు బదులుగా సంజు శాంసన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యాడు. కానీ, టీ20 క్రికెట్‌లో శాంసన్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది.

టీమిండియా తరపున 21 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడిన సంజూ శాంసన్ 374 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఇరవై ఒక్క ఇన్నింగ్స్‌లో అతను కేవలం 1 హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. అంటే, టీ20 క్రికెట్‌లో సంజూ శాంసన్ సగటు 19.68 మాత్రమే.

భారత్ తరపున 68 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడిన కేఎల్ రాహుల్ 2265 పరుగులు చేశాడు. అతను 2 సెంచరీలు, 22 అర్ధ సెంచరీలు చేశాడు. అంటే టీ20 క్రికెట్‌లో కేఎల్ రాహుల్ 37.75 సగటుతో పరుగులు సాధించాడు. ఇక్కడ కేవలం 19.68 సగటుతో ఉన్న సంజూ శాంసన్‌ను ఏ ప్రమాణాలతో ఎంపిక చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. అలాగే, 37.75 సగటుతో ఉన్న కేఎల్ రాహుల్‌ను ఎందుకు పక్కన పెట్టారని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ , కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.




