- Telugu News Photo Gallery Cricket photos Team India Captain Rohit Sharma May Break Virender Sehwag's Test Record
Rohit Sharma: సరికొత్త చరిత్రకు 8 అడుగుల దూరం.. సెహ్వాగ్ రికార్డ్‌ను బ్రేక్ చేయనున్న రోహిత్..
Rohit Sharma Records: టెస్టు క్రికెట్‌లో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ మాత్రమే 100 సిక్సర్లు కొట్టారు. ఈ జాబితాలో బెన్ స్టోక్స్ అగ్రస్థానంలో ఉండగా, బ్రెండన్ మెకల్లమ్ (107 సిక్సర్లు) రెండో స్థానంలో ఉన్నాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ (100) మూడో స్థానంలో నిలిచాడు. ఆరుగురు కెప్టెన్ల జాబితాలో చేరేందుకు రోహిత్ శర్మకు మంచి అవకాశం ఉంది.
Updated on: Sep 15, 2024 | 2:46 PM

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 8 సిక్సర్లు బాదితే సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుంది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సిక్సర్ల రికార్డును కూడా బద్దలు కొట్టడం విశేషం.

అంటే, టెస్టు క్రికెట్‌లో టీమిండియా తరపున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు. 180 ఇన్నింగ్స్‌లలో, సెహ్వాగ్ మొత్తం 91 సిక్సర్లు కొట్టాడు. భారతదేశంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టాలంటే రోహిత్ శర్మకు కేవలం 8 సిక్సర్లు మాత్రమే కావాలి. టీమిండియా తరపున 101 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ హిట్‌మ్యాన్ ఇప్పటివరకు 84 సిక్సర్లు కొట్టాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో రోహిత్ శర్మ ఎనిమిది సిక్సర్లు బాదితే.. భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కాడు.

అలాగే రోహిత్ శర్మ బ్యాట్‌తో 16 సిక్సర్లు బాదితే టెస్టు క్రికెట్‌లో 100 సిక్సర్లు బాదిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు. దీంతో పాటు ఈ రికార్డు నెలకొల్పిన ప్రపంచంలో 4వ బ్యాటర్‌గా కూడా నిలిచాడు.

ప్రస్తుతం ఈ జాబితాలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ తరపున 190 ఇన్నింగ్స్‌లు ఆడిన స్టోక్స్ మొత్తం 131 సిక్సర్లు కొట్టి టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాది ప్రపంచ రికార్డు సృష్టించాడు.




