- Telugu News Photo Gallery Cricket photos IND vs AUS Travis Head On Team India Ahead Of Border Gavaskar Trophy Telugu News
IND vs AUS: ‘టీమిండియా ఓ పిల్ల బచ్చా టీం.. నా లెక్కలోనే లేదు’: షాకిచ్చిన ఆసీస్ ప్లేయర్
Travis Head: టీమ్ ఇండియా తనకు ఇష్టమైన ప్రత్యర్థి కాదని ట్రావిస్ హెడ్ అన్నాడు. 2023లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మరియు ODI ప్రపంచకప్ ఫైనల్‌లో, ఈ ట్రావిస్ హెడ్ టీమ్ ఇండియా ఛాంపియన్ డ్రీమ్‌పై చల్లటి నీళ్లు చల్లాడు. ఈ రెండు టోర్నీల ఫైనల్స్‌లో భారత్‌పై హెడ్ సెంచరీలు సాధించాడు.
Updated on: Sep 15, 2024 | 6:42 PM

టీమిండియాతో మ్యాచ్ ఎలా ఉన్నా.. ఎంత భారీ టార్గెట్ ఉన్నా.. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ మాత్రం ఛేజింగ్ చేసేందుకు రెడీగా ఉంటాడు. రెండు ఐసీసీ టోర్నీల ఫైనల్ మ్యాచ్‌లే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. అందుకే ట్రావిస్ హెడ్‌కి టీమ్ ఇండియా ఫేవరెట్ ప్రత్యర్థి అని అందరూ అంటున్నారు.

అయితే, ఇప్పుడు దీనిపై మాట్లాడిన ట్రావిస్ హెడ్.. టీమ్ ఇండియా తన ఫేవరెట్ ప్రత్యర్థి జట్టు కాదని షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. 2023లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ODI ప్రపంచకప్ ఫైనల్‌లో ట్రావిస్ హెడ్ టీమ్ ఇండియా ఛాంపియన్ డ్రీమ్‌పై నీళ్లు చల్లాడు. ఈ రెండు టోర్నీల ఫైనల్స్‌లో భారత్‌పై హెడ్ సెంచరీలు సాధించడం గమనార్హం.

అంతేకాదు, 2024 టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్‌పై ట్రావిస్ హెడ్ 43 బంతుల్లో 76 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. హెడ్ క్రీజులో ఉన్నంత సేపు టీమ్ ఇండియాకు ఓటమి ఖాయమన్న మాట. కానీ, హెడ్ ఇన్నింగ్స్ 76 పరుగులకే ముగియడంతో ఆస్ట్రేలియా ఓటమి కూడా ఖాయమైంది.

2023లో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రెండో ఎడిషన్ ఫైనల్‌లో, హెడ్ ఇండియాపై 163 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇది కాకుండా, వన్డే ప్రపంచకప్ ఫైనల్లో అతను 137 పరుగులు చేశాడు. ఈ రెండు ఫైనల్స్‌లోనూ హెడ్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

త్వరలో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ గురించి స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన హెడ్, 'టీమ్ ఇండియా నా ఫేవరెట్ టీమ్ అని నేను అనుకోను. టీమ్ ఇండియాతో ఆస్ట్రేలియా జట్టు ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతుంది. అంతేకాకుండా, నేను గత కొన్నేళ్లుగా మంచి ఫామ్‌లో ఉన్నానని అనుకుంటున్నాను అంటూ కుండ బద్దలు కొట్టాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ట్రావిస్ హెడ్ అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. స్కాట్లాండ్‌తో టీ20 సిరీస్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హెడ్.. తొలి టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కానీ, రెండో టీ20లో మాత్రం విఫలమయ్యాడు. దీంతోపాటు జట్టు కూడా ఓడిపోయింది. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది.




