- Telugu News Photo Gallery Cricket photos Sunrisers hyderabad star and south africa key player heinrich klaasen has retired from tests
టీమిండియాపై అరంగేట్రం.. కట్‌చేస్తే.. 4 మ్యాచ్‌ల తర్వాత రిటైర్మెంట్.. భారీ షాక్ ఇచ్చిన సన్‌రైజర్స్ స్టార్ ప్లేయర్..
Sunrisers Hyderabad Star Player Heinrich Klaasen: దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ రిటైరయ్యాడు. క్లాసెన్ హఠాత్తుగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని కూడా వివరించాడు. క్లాసెన్ 4 టెస్టులు మాత్రమే ఆడాడు. గతేడాది అవకాశం వచ్చినా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు. కాగా, గత కొన్ని రోజులుగా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు.
Updated on: Jan 08, 2024 | 3:42 PM

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ రిటైరయ్యాడు. ఈ మేరకు సోమవారం ఆయన తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. రిటైర్‌మెంట్ ప్రకటించిన సందర్భంగా క్లాసెన్ మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నందుకు చాలా బాధగా ఉందంటూ చెప్పుకొచ్చాడు.

తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన క్లాసెన్, 'కొన్ని రాత్రులు నిద్రలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది చాలా కష్టమైన నిర్ణయం ఎందుకంటే ఇది నాకు ఇష్టమైన ఫార్మాట్' అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.

హెన్రిచ్ క్లాసెన్ దక్షిణాఫ్రికా తరపున కేవలం 4 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2018లో భారత్‌పై అరంగేట్రం చేశాడు. అయితే, ఆ తర్వాత ఐదేళ్లలో అతనికి కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం లభించింది.

హెన్రిచ్ క్లాసెన్ వైట్ బాల్ క్రికెట్‌లో తుఫాను హిట్టింగ్‌కు ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. అయితే, టెస్టుల్లో మాత్రం అతని ప్రదర్శన పేలవంగా నిలిచింది. అతను 4 టెస్టుల్లో 104 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతని బ్యాట్ నుంచి ఒక్క అర్ధ సెంచరీ, సెంచరీ కూడా రాలేదు.

అయితే, క్లాసెన్ ఫస్ట్ క్లాస్ కెరీర్ అద్భుతంగా ఉంది. ఈ ఫార్మాట్‌లో 12 సెంచరీలు చేసిన ఈ ఆటగాడు.. 5347 పరుగులతో ఆకట్టుకున్నాడు.




