
Rajasthan Royals vs Mumbai Indians Confirmed Playing XI in Telugu: రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓ మోస్తరు టార్గెట్ ను విధించింది. తిలక్ వర్మ (65), నేహాల్ వధేలా (49) మాత్రమే రాణించారు.

టాపార్డర్ బ్యాటర్లు రోహిత్‌శర్మ (6), ఇషాన్ కిషన్ (0), సూర్యకుమార్ యాదవ్ (10) తీవ్రంగా నిరాశపరిచారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (10) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.

టిమ్ డేవిడ్(3), నబీ (23) పరుగులు చేశారు. కొయిట్జీ డకౌట్ కాగా పీయూష్ చావ్లా (1 నాటౌట్), జస్ ప్రీత్ బుమ్రా (2 నాటౌట్) పరుగులు చేశారు

రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ 5 వికెట్లతో ముంబై బ్యాటర్లకు మూకుతాడు వేశాడు .అలాగే బౌల్ట్ 2 వికెట్లు తీయగా, అవేశ్, యుజ్వేంద్ర చెరో వికెట్ పడగొట్టారు.

కాగా ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ లో గెలవడం ముంబైకు తప్పనసరి. ఇప్పుడు జట్టు గెలుపు బాధ్యతంతా బౌలర్ల మీదనే ఉంది. చూడాలి మరేం జరుగుతుందో