కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండో రిటైనర్‌గా కనిపించనున్నాడు. డుప్లెసిస్‌ను ఆర్‌సీబీ విడుదల చేస్తుందని గతంలో వార్తలు వినిపించాయి. కానీ, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అతని అద్భుతమైన ప్రదర్శన, సెయింట్ లూసియా కింగ్స్‌ను ఛాంపియన్‌గా చేసినందున ఫాఫ్‌ను తదుపరి సీజన్‌లో జట్టులో ఉంచాలని RCB నిర్ణయించినట్లు PTI పేర్కొంది.