- Telugu News Photo Gallery Cricket photos NZ vs SA: Quinton de Kock breaks jacques kallis’ Big record of most runs by a South Africa batter in a World Cup History
NZ vs SA: జాక్వెస్ కల్లిస్ భారీ రికార్డును బ్రేక్ చేసిన క్వింటన్ డి కాక్.. తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా..
ICC ODI World Cup 2023, Quinton de Kock breaks Kallis’ record: సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ అద్భుతమైన రికార్డ్‌ను తన పేరుతో లిఖించుకున్నాడు. ప్రపంచ కప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టాడు. గతంలో 2007లో జాక్వెస్ కల్లిస్ చేసిన 485 పరుగుల రికార్డును డి కాక్ అధిగమించాడు. ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో దక్షిణాఫ్రికా ప్లేయర్లు చేసిన అత్యధిక పరుగుల లిస్టులో ఎవరున్నారో ఓసారి చూద్దాం.
Updated on: Nov 01, 2023 | 5:08 PM

పుణెలో న్యూజిలాండ్‌తో జరుగుతోన్న 32వ లీగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ అద్భుతమైన రికార్డ్‌ను తన పేరుతో లిఖించుకున్నాడు. ప్రపంచ కప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన దక్షిణాఫ్రికా బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టాడు.

గతంలో 2007లో జాక్వెస్ కల్లిస్ చేసిన 485 పరుగుల రికార్డును డి కాక్ అధిగమించాడు. ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులను ఓసారి చూద్దాం.

1) క్వింటన్ డి కాక్* - 2023లో 80.67 సగటుతో ఏడు ఇన్నింగ్స్‌లలో 486 పరుగులు

2) జాక్వెస్ కలిస్ - 2007లో 80.83 సగటుతో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 485 పరుగులు

3) ఏబీ డివిలియర్స్ - 2015లో 96.40 సగటుతో ఏడు ఇన్నింగ్స్‌లలో 482 పరుగులు

4) గ్రేమ్ స్మిత్ - 2007లో 49.22 సగటుతో 10 ఇన్నింగ్స్‌ల్లో 443 పరుగులు.

5) పీటర్ కిర్‌స్టన్ - 1992లో 78.20 సగటుతో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 410 పరుగులు.





























