- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Team India former cricketer irfan phatan Slams Hardik Pandya's Bad Captaincy
IPL 2024: ‘యాడ దొరికాడ్రా సామీ.. ముంబైని ముంచేందుకే ఏరి కోరి మరీ తెచ్చుకున్నారు’
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో గుజరాత్ టైటాన్స్‌ను విజయవంతంగా నడిపించిన హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా శుభారంభం చేయడంలో విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఓడిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు ఎస్‌ఆర్‌హెచ్‌పై కూడా ఓడిపోయింది. దీంతో ముంబై ఇండియన్స్ వరసుగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
Updated on: Mar 28, 2024 | 2:37 PM

హైదరాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 8వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విమర్శలు మొదలయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఆయనలోని నాయకత్వ లక్షణాలే.

ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బౌలర్లు ఖరీదైనందున, హార్దిక్ జస్ప్రీత్ బుమ్రాను ఉపయోగించకపోవడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ 11 ఓవర్లలో 160+ పరుగులు చేసింది. కానీ, హార్దిక్ పాండ్యా ఎప్పుడూ బుమ్రాను ఉపయోగించుకోలేదు. తొలి పదకొండు ఓవర్లలో కేవలం 1 ఓవర్ మాత్రమే ఇచ్చాడు. దీంతో జట్టులో అత్యుత్తమ బౌలర్‌తో ఎప్పుడు బౌలింగ్ చేయాలో తెలియదా? అంటూ టీమిండియా మాజీ ప్లేయర్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా పేలవమైన నాయకత్వం అని టీమిండియా మాజీ ఆటగాడు యూసుఫ్ పఠాన్ విమర్శించారు.

ఇదే విషయమై X చేసిన ఆస్ట్రేలియా లెజెండ్ టామ్ మూడీ, జస్ప్రీత్ బుమ్రా ఎక్కడ ఉన్నారు? మ్యాచ్ మొత్తం చేజారిపోతున్నప్పటికీ అత్యుత్తమ బౌలర్‌కు ఒక్క ఓవర్ మాత్రమే ఇస్తారా. అలాంటి కెప్టెన్సీకి అర్థం ఏంటని ప్రశ్నించారు.

ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగించడం చాలా ఆశ్చర్యకరమైన చర్య అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అన్నాడు. అది కూడా హార్దిక్ పాండ్యా పేలవ నాయకత్వాన్ని చూశాకా ఇదే అర్థమవుతుంది.

ముంబై ఇండియన్స్ బౌలర్లను SRH బ్యాట్స్‌మెన్స్ నిరంతరం దెబ్బతీస్తున్నప్పటికీ హార్దిక్ పాండ్యా ఆశ్చర్యకరమైన చర్యలో జస్ప్రీత్ బుమ్రాను దూరంగా ఉంచాడు. ఇది హార్దిక్ పాండ్యా నాయకత్వ లక్షణాలను ఇది హైలైట్ చేసిందని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, హెన్రిక్ క్లాసెన్‌ను కట్టడి చేసేందుకు హార్దిక్ పాండ్యా మొదటి 10 ఓవర్లలో బుమ్రాకు 1 ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. అయితే, క్లాసెన్ రాకముందే SRH బ్యాట్స్‌మెన్ 10 ఓవర్లలో 148 పరుగులు చేసి చరిత్ర సృష్టించారు. అయితే హార్దిక్ పాండ్యా ఒక్కడు చాలు ముంబై ఇండియన్స్‌ను ముంచేందుకు అంటూ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత హార్దిక్ పాండ్యా భవితవ్యం చాలా పేలవంగా కనిపిస్తోంది. ఓ వైపు రోహిత్ శర్మ ఫ్యాన్స్ వెక్కిరించడం, మరోవైపు లెక్కలు తారుమారవడం వల్ల పాండ్యా కష్టాల్లో పడ్డాడన్నది వాస్తవం.




