- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Rohit Sharma Fans vs Hardik Pandya in Wankhede Stadium, Mumbai Key match between mi vs rr
IPL 2024: వాంఖడేలో పాండ్యాకు బిగ్ టెస్ట్.. అందుకు సిద్ధమైన రోహిత్ ఫ్యాన్స్..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 14వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. వాంఖడే స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ ద్వారా హార్దిక్ పాండ్యా సేన గెలుపు ఖాతా తెరుస్తామన్న విశ్వాసంతో ఉంది. గతంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లపై ముంబై ఇండియన్స్ ఓడిపోయింది.
Updated on: Apr 01, 2024 | 12:23 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) సీజన్-17లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పుడు మూడో మ్యాచ్‌కు సిద్ధమైంది. సోమవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది.

అయితే ఈ మ్యాచ్ హార్దిక్ పాండ్యాకు అగ్నిపరీక్షగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే పాండ్యా నాయకత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు తొలిసారి వాంఖడే స్టేడియంలో పోటీపడుతోంది. గతంలో ముంబై అహ్మదాబాద్, హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఆడింది.

ఈ రెండు మ్యాచ్‌ల సమయంలో హార్దిక్ పాండ్యాను రోహిత్ శర్మ అభిమానులు దుర్భాషలాడారు. ముఖ్యంగా పాండ్యా స్వస్థలం అహ్మదాబాద్‌లోనూ వెక్కిరించారు. ఇప్పుడు రోహిత్ శర్మ సొంత మైదానం వాంఖడేతో ముంబై ఇండియన్స్ తలపడనుంది.

వాంఖడే మైదానంలో రోహిత్ శర్మనే హీరోగా చూస్తుంటారు. హార్దిక్ పాండ్యా హీరోగా హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ అంగీకరించడానికి సుతారాం సిద్ధంగా లేడు. దీంతో ముంబై ఇండియన్స్ టీమ్ కొత్త కెప్టెన్‌ని తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఆటపట్టించారు. ఇప్పుడు వాంఖడేలో ఆడబోతున్న పాండ్యాకు మళ్లీ అవమానం ఎదురయ్యే అవకాశం ఉంది.

ముంబై ఇండియన్స్ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ అభిమానులు ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. కాబట్టి ఈరోజు వాంఖడే స్టేడియంలో హిట్ మ్యాన్ నినాదాలు మోగడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.

ఇంతలో హార్దిక్ పాండ్యా వచ్చే అవహేళనను భరించాల్సిందే. ఈ గడ్డు పరిస్థితిని కెప్టెన్ పాండ్యా ఎలా ఎదుర్కొంటాడో ఈరోజు తేలనుంది.





























