IPL 2024: లసిత్ మలింగ రికార్డును బద్దలు కొట్టిన సునీల్ నరైన్.. కట్‌చేస్తే.. ఆ స్పెషల్ లిస్టులో దూకుడు..

Updated on: Apr 22, 2024 | 1:15 PM

KKR All Rounder Sunil Narine: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian Premier League 2024) చరిత్రలో ఒకే జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా సునీల్ నరైన్ రికార్డు సృష్టించాడు. 2012 నుంచి కేకేఆర్ తరపున ఆడుతున్న నరైన్ మొత్తం 172 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు ముంబై ఇండియన్స్‌ తరపున 170 వికెట్లు తీసిన లసిత్ మలింగ పేరిట ఉంది.

1 / 5
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 36వ మ్యాచ్‌లో సునీల్ నరైన్ ప్రత్యేక రికార్డు సృష్టించాడు. లసిత్ మలింగ రికార్డును కూడా అధిగమించడం విశేషం.

2 / 5
ఆర్‌సీబీతో జరిగిన ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన నరైన్ 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు వికెట్లతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సునీల్ నరైన్ 6వ స్థానానికి చేరుకున్నాడు.

3 / 5
అంతకు ముందు లసిత్ మలింగ 6వ స్థానంలో ఉన్నాడు. 122 ఐపీఎల్ మ్యాచుల్లో బౌలింగ్ చేసిన మలింగ మొత్తం 170 వికెట్లు పడగొట్టి ఈ రికార్డును లిఖించాడు.

4 / 5
సునీల్ నరైన్ 168 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 172 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన 2వ విదేశీ బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో డ్వేన్ బ్రావో (183) అగ్రస్థానంలో ఉన్నాడు.

5 / 5
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో యుజ్వేంద్ర చాహల్ అగ్రస్థానంలో ఉన్నాడు. చాహల్ 151 ఇన్నింగ్స్‌ల ద్వారా మొత్తం 199 వికెట్లు తీశాడు. ఇప్పుడిప్పుడే డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతున్న చాహల్ ఒక్క వికెట్‌తో ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.