IND vs SL: ఈ గ్రౌండ్‌లోనైనా సెంచరీ చేస్తాడా.. అభిమానుల కోరిక నెరవేరుస్తాడా..

|

Mar 11, 2022 | 1:50 PM

IND vs SL: మొహాలీ టెస్టులో టీమిండియా సులువుగా విజయం సాధించింది. ఆ తర్వాత భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్ట్‌ మార్చి 12 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం.

1 / 4
మొహాలీ టెస్టులో టీమిండియా సులువుగా విజయం సాధించింది. ఆ తర్వాత భారత్-శ్రీలంక మధ్య  రెండో టెస్ట్‌ మార్చి 12 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి ఈ మ్యాచ్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇది కోహ్లీకి రెండో హోమ్ గ్రౌండ్. ఇందులోనైనా సెంచరీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

2 / 4
గత 14 ఏళ్లుగా ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కోహ్లి.. ఈ మైదానంలో ఎన్నో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అయితే టీమిండియా తరఫున కేవలం 3 టెస్టులు మాత్రమే ఆడాడు. అయినప్పటికీ అతని రికార్డు బాగానే ఉంది. ఈ మైదానంలో కోహ్లీ కేవలం 4 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడి 60 కంటే ఎక్కువ సగటుతో 181 పరుగులు చేశాడు.

3 / 4
ఈ మైదానంలో కోహ్లి సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించాడు. 2012లో న్యూజిలాండ్‌పై 103 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లి కెరీర్‌లో ఇది రెండో సెంచరీ కాగా భారత్‌లో ఇది తొలి సెంచరీ. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేశాడు.

4 / 4
ఇక ఈ స్టేడియంలో జరిగిన డే-నైట్ మ్యాచ్‌ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీయే. ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ సహా మొత్తం 241 పరుగులు చేశాడు.