- Telugu News Photo Gallery Cricket photos India former captain MS Dhoni birthday, know why he is not active on social media platforms
Dhoni Birthday Special: ఎంఎస్ ధోని సోషల్ మీడియాకు దూరంగా ఎందుకు ఉంటాడో తెలుసా?
Mahendra Singh Dhoni Birthday: మహేంద్ర సింగ్ ధోనీ ఈరోజు తన 42వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ధోనీ పేరు చేరింది. అతని కెప్టెన్సీలో టీమిండియా 2007 T20 ప్రపంచ కప్, 2011 ODI ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
Updated on: Jul 07, 2023 | 4:50 PM

Mahendra Singh Dhoni: మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ ముఖ చిత్రాన్ని మార్చేశాడు. దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించాడు. కాగా, జులై 7, 1981లో జన్మించిన ఈ దిగ్గజ క్రికెటర్.. ఈరోజు తన 42వ పుట్టినరోజు సెలట్రేబ్ చేసుకుంటున్నాడు. ఈ రాంచీ యువరాజుకున్న ప్రజాదరణను ఏ క్రికెటర్‌తోనూ పోల్చలేం. అతను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యి చాలా రోజులైంది.

కానీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతని మ్యాజిక్ ఇప్పటికీ కనిపిస్తుంది. ధోనీ మ్యాచ్ చూసేందుకు అభిమానులు కిలోమీటర్ల మేర ప్రయాణించి స్టేడియంకు చేరుకుంటున్నారు. కెప్టెన్సీలో అతనికి సాటి లేదు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నైని ఛాంపియన్‌గా నిలిపి మరోసారి తన సత్తా నిరూపించాడు. అసలు ధోనీ సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటాడు. ఆ విషయం అసలు ఆయనకు తప్ప ఎవ్వరికీ తెలియదు. తన పని తను చూసుకుంటూ వెళ్తుంటాడు. వాటి గురించి పెద్దగా సోషల్ మీడియాలో పంచుకోవాలని కోరుకోడు.

మైదానంలో ధోనీ ఎంత కూల్‌గా, ప్రశాంతంగా ఉంటాడో, మైదానం వెలుపల కూడా అంతే. వివాదాలతో తనకు సంబంధం లేదు. అతని స్నేహితులు కూడా పరిమితం. అతను అందరినీ తన ప్రత్యేకతగా మార్చుకోడు. ధోనీకి ఏ పెద్ద స్టార్ కూడా ప్రత్యేకమైన స్నేహితుడు కాదు. ధోనీ స్నేహితుల జాబితాలో సురేష్ రైనా, ఆర్పీ సింగ్ లాంటి క్రికెటర్లు ఉన్నారు.

ట్విట్టర్‌లో 8.6 మిలియన్ల మంది ధోనిని అనుసరిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఈ లెజెండరీ క్రికెటర్ చివరిగా జనవరి 8, 2021న ట్వీట్ చేశాడు. 2 సంవత్సరాల క్రితం అని అర్థం. అదే సమయంలో, అతనికి ఫేస్‌బుక్‌లో 27 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ వారి కోసం, ధోని తన చివరి పోస్ట్‌ను జులై 1న పంచుకున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ధోనీకి 44 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అతను తన ఖాతా నుంచి 108 పోస్ట్‌లను మాత్రమే షేర్ చేశాడు. ధోని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి చివరి పోస్ట్ 21 వారాల క్రితం షేర్ చేశాడు. ఇందులో మహి ట్రాక్టర్ నడుపుతూ కనిపించాడు.

ధోనీకి తనదైన ప్రపంచం ఉంది. ఏం జరిగినా తన అభిమానులతో పంచుకునే వ్యక్తుల్లో అతను ఉండడు. దేశం, ప్రపంచ సమస్యలపై కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి దూరంగా ఉంటాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత జరిగే వేడుకల్లో వెనుకబడి ఉండేవాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించేవాడు.

ఇప్పుడు మహీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, ధోని తాజా ఫొటోలు అతని భార్య సాక్షి ధోని ఖాతా ద్వారా లేదా వివిధ అభిమానుల ద్వారా సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. ఒక అభిమాని అతని ఫోటోను పోస్ట్ చేసిన వెంటనే, అది వెంటనే వైరల్ అవుతుంది. ఇది నేటికీ ధోనీకి ఉన్న పాపులారిటీని చూపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.




