- Telugu News Photo Gallery Cricket photos IND Vs AFG 2nd T20I Afghanistan Registered Highest T20i Score Against India check records
IND vs AFG: భారత్‌పై అఫ్గానిస్థాన్ స్పెషల్ రికార్డ్.. తగ్గేదేలే అంటోన్న ఆటగాళ్లు..!
IND vs AFG: మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 173 పరుగుల లక్ష్యాన్ని అందించింది. 172 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్థాన్ జట్టు మూడు రోజుల క్రితం తన రికార్డును తానే బ్రేక్ చేసింది. దీంతోపాటు భారత జట్టుకు ధీటుగా పోటీ ఇస్తోంది. ఏ దశలోనూ తగ్గేదేలే అంటూ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ రాణిస్తోంది.
Updated on: Jan 15, 2024 | 8:35 AM

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్-అఫ్గానిస్థాన్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

దీని ప్రకారం తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 173 పరుగుల లక్ష్యాన్ని అందించింది. అంటే, 172 పరుగులకు ఆలౌటైంది. ఆఫ్ఘనిస్తాన్ మూడు రోజుల క్రితం తన రికార్డును తానే బ్రేక్ చేసింది.

పైన చెప్పుకున్నట్టుగానే భారత్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 172 పరుగులు చేసింది. టీ20 ఫార్మాట్‌లో భారత్‌పై అఫ్గానిస్థాన్‌కు ఇదే అత్యధిక స్కోరు. దీనికి ముందు జనవరి 11న భారత్‌పై ఆఫ్ఘనిస్తాన్ 158 పరుగులు చేసింది.

ఇంతకుముందు ఈ ఫార్మాట్‌లో టీమ్‌ఇండియాపై అఫ్గానిస్థాన్ ఇంత పెద్ద స్కోరు చేయలేదు. సిరీస్‌లో కీలకమైన మ్యాచ్ కావడంతో గెలవాలనే ఒత్తిడిలో ఉన్న అఫ్గానిస్థాన్ భారత్‌కు పోటాపోటీగా టోర్నీలో సత్తా చాటుతోంది.

ఆఫ్ఘనిస్తాన్‌ను 172 పరుగుల స్కోరుకు తీసుకెళ్లడంలో గుల్బాదిన్ నైబ్ గొప్ప సహకారం అందించాడు. నైబ్ కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 162.85 స్ట్రైక్ రేట్‌తో 57 పరుగులు చేశాడు. గుల్బాదిన్‌తో పాటు, నజీబుల్లా జద్రాన్ 23 పరుగులు, ముజీబ్ ఉర్ రెహ్మాన్ 21 పరుగులు, కరీం జనత్ 20 పరుగులు చేశారు.

భారత్ తరపున అర్ష్‌దీప్ సింగ్ 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. శివమ్ దూబే కూడా ఒక వికెట్ తీశాడు.




