ODI World Cup Records: ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు వీరే.. టాప్‌లో ఎవరున్నారంటే?

World Cup Records: క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2023 అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. క్రికెట్ వరల్డ్ కప్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 మధ్య జరగనుంది. అక్టోబర్ 5న నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుండగా, ఫైనల్ మ్యాచ్ కూడా నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనుంది. క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో భారత్ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. భారత క్రికెట్ జట్టు 1983, 2011లో ప్రపంచకప్ గెలిచింది. కాబట్టి క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్స్ ఎవరో చూద్దాం..

Venkata Chari

|

Updated on: Sep 26, 2023 | 8:52 AM

సచిన్ టెండూల్కర్- 2278 పరుగులు: ప్రపంచ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్ ప్రపంచకప్ చరిత్రలో 2278 పరుగులతో అత్యధిక పరుగులు చేశాడు. 44 ఇన్నింగ్స్‌లలో 56.95 సగటుతో పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

1 / 5
రికీ పాంటింగ్- 1743 పరుగులు: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ పాంటింగ్ 1743 పరుగులు చేశాడు. అతను 42 ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు, 6 అర్ధసెంచరీలతో సహా 45.86 సగటుతో 1743 పరుగులు చేశాడు.

2 / 5
కుమార్ సంగక్కర-1532 పరుగులు: శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర 35 ప్రపంచకప్ ఇన్నింగ్స్‌లలో 5 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో సహా 56.74 సగటుతో 1532 పరుగులు చేశాడు.

3 / 5
బ్రియాన్ లారా- 1225 పరుగులు: వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ లారా 33 ప్రపంచ కప్ ఇన్నింగ్స్‌లలో 42.24 సగటుతో 2 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలతో 1225 పరుగులు చేశాడు.

4 / 5
ఏబీ డివిలియర్స్- 1207 పరుగులు: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో 63.52 సగటుతో 22 ఇన్నింగ్స్‌లలో 4 సెంచరీలు, 6 అర్ధసెంచరీలతో 1207 పరుగులు చేశాడు.

5 / 5
Follow us