5 / 5
పగిలిన మడమలకు పండిన బొప్పాయిని ఉపయోగించవచ్చు. బొప్పాయి తురుము పగిలిన మడమల మీద రాయాలి. ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే పగుళ్లు క్రమంగా తగ్గుతాయి. పగిలిన పాదాల మృదుత్వాన్ని పునరుద్ధరించడానికి నిమ్మ, పెట్రోలియం జెల్లీ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ పెట్రోలియం జెల్లీలో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి, పగిలిన మడమల మీద క్రమం తప్పకుండా అప్లై చేయాలి. ఇలా చేస్తే సత్వర ఫలితాలు పొందవచ్చు.