ఒడిశా రైలు ప్రమాదంతో మొత్తం 43 రైళ్లను రద్దు చేసింది రైల్వేశాఖ. 18 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా.. 38 రైళ్లను దారిమళ్లిస్తున్నారు. హౌరా-సికింద్రాబాద్, హౌరా-బెంగళూరు, షాలిమార్-హైదరాబాద్, హౌరా-తిరుపతి, కన్యాకుమారి-హౌరా, డిబ్రూగర్-సికింద్రాబాద్ రైళ్లను పూర్తిగా రద్దుచేశారు. సికింద్రాబాద్-షాలిమార్, బెంగళూరు-గౌహతి, డిబ్రూగర్-సికింద్రాబాద్ రైళ్లను దారిమళ్లించారు.