
మెంతికూర పప్పు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పప్పును ఆంధ్రాలో చాలా ఫేమస్. ఇంకా కందిపప్పు, మెంతి ఆకులు, టమోటాలతో చేసి వండుతారు. ఈ పప్పును వేడి అన్నంతో తింటే రుచిగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇంకా ఇది జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది.

మెంతికూర పప్పుకు కావాల్సిన పదార్దాలు: ఒక కట్ట మెంతి కూర, ఒక కప్పు కందిపప్పు లేదా పెసరపప్పు, మూడు టమోటాలు, 2 పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.

మెంతికూర పప్పు తయారీ విధానం: ముందుగా కందిపప్పు లేదా పెసరపప్పును మూడు సార్లు మంచి నీటితో కడిగి 15 నిమిషాల పాటు నానాబెట్టుకోవాలి. ఆ తరవాత దీనిని కుక్కర్‌లో 5 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికిన తరవాత కట్ట మెంతికూర టమోటా ముక్కలు , పచ్చిమిర్చి వేసి బాగా ఉడికించాలి.

ఆ తరవాత ఈ పప్పులోన అర టేబుల్ స్పూన్ పసుపు , నీరు పోసి 4 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ మీదే ఉంచి బాగా ఉడికించుకోవాలి. మీరు పప్పు వండేటప్పుడు అడుగు అంటనివ్వొద్దు అలా అంటితే టేస్ట్ మొత్తం మారిపోతోంది. కాబట్టి, మీడియం మంట మీద పప్పును ఉడికించాలి.

పప్పును తాలింపు పెట్టుకోవాలి: పాన్ లో ఆయిల్ వేసి, అది వేడి అయినా తరవాత అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, నాలుగు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు ఆకులు, ఇంగువ వేస్తె మంచి రుచి వస్తుంది. దీనిని తీసుకుని ఉడికిన పప్పులో వేయాలి. అంతే, వేడి వేడి పప్పు రెడీ.