చాలా మంది బంగాళదుంప లేకుండా ఆహారం తీసుకోని పరిస్థితి ఉంటుంది. ఏదో వంటకంలో బంగాళదుంపను వినియోగిస్తారు. అయితే, ఈ బంగాళదుంపను ఫ్రై చేసినా కొందరు ఉడకబెట్టిన తరువాతే చేస్తారు. ఆహారం రుచిని పెంచే బంగాళదుంపను అనేక విధాలుగా ఉపయోగిస్తారు.
చపాతీ, రోటీ, అన్నం, చిప్స్ ఇలా అనేక ఆహారాలలో బంగాళదుంప ఫ్రై, కూరను తింటారు. అయితే, వీటిని ఉడకబెట్టడం అనేదే పెద్ద టాస్క్ ఇక్కడ.
చపాతీ, రోటీ, అన్నం, చిప్స్ ఇలా అనేక ఆహారాలలో బంగాళదుంప ఫ్రై, కూరను తింటారు. అయితే, వీటిని ఉడకబెట్టడం అనేదే పెద్ద టాస్క్ ఇక్కడ.
ముందుగా బంగాళాదుంపలను బాగా కడగాలి. ఆ తరువాత బంగాళాదుంపపై తొక్క తీసి వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన అవి త్వరగా ఉడుకుతాయి.
బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే ముందుగా వేడి నీటిలో వాటిని వేయాలి. కాసేపటి తరువాత వాటిపై తొక్కలను తీసేసి, కొద్దిగా ఉప్పు వేసి మళ్లీ వేడి నీటిలో ఉడికించాలి. ఇలా చేస్తే బంగాళదుంపలు త్వరగా ఉడుకుతాయి.