
ఆఫ్ఘనిస్తాన్: కొన్ని నివేదికల ప్రకారం.. కండోమ్‌లను నిషేధించిన దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ మొదటి ప్లేస్‌లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం దేశంలో కండోమ్‌ల వాడకాన్ని నిషేధించింది. ఎందుకంటే కండోమ్ వాడకం ఇస్లామిక్ విలువలకు విరుద్ధమని అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకే ఈ నిర్ణయం తసుకుంది. ఇక్కడ కండోమ్‌లను అమ్మడం చట్టవిరుద్ధమైన చర్య. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించే వీటిని అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

ఇండోనేషియా: ఆఫ్ఘనిస్తాన్ తర్వాత కండోమ్‌లను పూర్తిగా నిషేధించిన రెండవ దేశం ఇండోనేషియా. ఇక్కడ కండోమ్‌ల వాడకం వ్యభిచారం, అనైతిక సంబంధాలను పెంచుతుందని ఇక్కడి ప్రభుత్వం పేర్కొంది. అందువల్ల, దేశంలో కండోమ్‌ల వాడకాన్ని నిషేధించింది

నైజీరియా: నైజీరియాలో కండోమ్‌ల అమ్మకం, వాడకం చట్టవిరుద్ధం. అక్కడ లభించే కండోమ్‌లు నాణ్యత లేనివని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇక్కడి ప్రజలు వాటిని ఉపయోగించడానికి వెనుకాడతారు. సురక్షితమైన లైంగికసంబంధం గురించి అక్కడ అవగాహన తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఉత్తర కొరియా: ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ దేశ జనాభాను పెంచాలనుకుంటున్నారు. కండోమ్ వాడకం దేశ జనాభా పెరుగుదల విధానానికి విరుద్ధమని కిమ్ ప్రభుత్వం విశ్వసిస్తుంది. అందుకే ఆయన ఉత్పత్తిని మాత్రమే కాకుండా కండోమ్‌ల వాడకాన్ని కూడా నిషేధించారు.

ఫిలిప్పీన్స్: ఫిలిప్పీన్స్‌లో కాథలిక్ చర్చికి బలమైన ప్రభావం ఉంది. చర్చి ప్రకారం, కండోమ్‌ల వాడకం ప్రకృతి నియమాలకు, మతపరమైన ఆలోచనలకు విరుద్ధం. అందువల్ల, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఇక్కడ కండోమ్‌ల వాడకాన్ని నిషేధించింది.