
ఎండాకాలం, వర్షాకాలం కంటే చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మన చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేకాదు ఈ సమయంలో సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తదితర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Coconut Oil

అనేక చర్మ, ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గించడంలో కొబ్బరి నూనె బలేగా ఉపయోగపడుతుంది. ఇది కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. రాత్రిపూట కాళ్లకు నూనె రాసుకోవడం వల్ల కండరాల నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.

అంతేకాదు పాదాలకు నూనె రాసుకోవడం వల్ల చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కాలి గోర్లు తేమగా, మెరుస్తూ ఉంటాయి. చర్మం మృదువుగా మారుతుంది.

రాత్రిపూట పాదాలకు నూనె రాయడం వల్ల పాదాలపై పగుళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. నిద్ర కూడా బాగుంటుంది. వైరస్‌లు,ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది.