
కొబ్బరి పాలను తయారు చేసి రాత్రంతా ఫ్రిజ్‌లో పెడితే.. మందపాటి క్రీమ్ పైకి చేరుకుంటుంది. మర్నాడు ఉదయం ఈ క్రీమ్‌ను తీసి ఒక గిన్నెలో పెట్టుకోండి. దీనినే కొబ్బరి క్రీమ్ అంటారు. దీనిని సహజంగా తయారు చేసుకోవచ్చు. మార్కెట్ లో కూడా దొరుకుంతుంది. ఈ కొబ్బరి క్రీమ్ రుచికరంగా ఉండటమే కాదు పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. అయితే ఇది అందరికీ ప్రయోజనకరంగా ఉండదు. ఇందులో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. దీంతో కొబ్బరి క్రీమ్ కొంతమందికి హానికరం కావచ్చు. ఈ రోజు ఏ వ్యక్తులు దీన్ని అస్సలు తినకూడదో తెలియని వ్యక్తులు చాలా మంది ఉన్నారు.

ఈ రోజు కొబ్బరి క్రీమ్ ను ఎవరు తినవద్దు.. ఎందుకు తినొద్దు అనే విషయంపై ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా అనేక విషయాలను చెప్పారు. ఎటువంటి వ్యాధులు లేని వారికి కొబ్బరి క్రీమ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని.. ముఖ్యంగా బరువు పెరగాలనుకునే వారికి కొబ్బరి క్రీమ్ తినడం మంచిది అని ఆయన అన్నారు. అయితే కొబ్బరి క్రీమ్ ను సరైన పరిమాణంలో తీసుకోవడం చాలా ముఖ్యం. కొబ్బరి క్రీమ్ ను కొంత మంది తినవద్దు.. ఎందుకంటే

అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారు: కొబ్బరి క్రీమ్‌లో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఎవరికైనా కొలెస్ట్రాల్ ఇప్పటికే ఎక్కువగా ఉంటే.. దీనిని తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అలాంటి వారు దీన్ని తక్కువ పరిమాణంలో తినాలి లేదా అస్సలు తినవద్దు

మధుమేహ రోగులు: కొబ్బరి క్రీమ్‌లో సహజ చక్కెర , కొవ్వు ఉంటాయి. ఇది మధుమేహ రోగులకు హానికరం. ఇది రక్తంలో చక్కెరను పెంచుతుంది. కనుక డయాబెటిక్ రోగులు దీనిని తినకుండా ఉండాలి లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తినాలి.

బరువు తగ్గాలనుకునే వారు: మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే కొబ్బరి క్రీమ్ ఎక్కువగా తినొద్దు. ఇందులో అధిక కేలరీలు, కొవ్వు ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. కనుక తక్కువ పరిమాణంలో తినడం మంచిది.

కడుపు సమస్యలు ఉన్నవారు: కొబ్బరి క్రీమ్‌లో అధిక కొవ్వు ఉంటుంది. ఇది కొంతమందికి జీర్ణం కావడానికి కష్టంగా ఉంటుంది. దీనివల్ల ఆమ్లత్వం, అపానవాయువు లేదా అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఎవరికైనా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే.. కొబ్బరి క్రీమ్ ను తినొద్దు.

గుండె రోగులు: ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కొబ్బరి క్రీమ్‌ను తక్కువగా తీసుకోవాలి. దీనిలో ఉండే సంతృప్త కొవ్వు గుండె ధమనులలో అడ్డంకిని పెంచుతుంది. దీంతో గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెరుగుతుంది.

అలెర్జీలు ఉన్నవారు: కొంతమందికి కొబ్బరి అంటే అలెర్జీ ఉండవచ్చు. అటువంటి వారు కొబ్బరి క్రీమ్ తినడం వలన దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. మీకు కొబ్బరి అంటే అలెర్జీ ఉంటే కొబ్బరి క్రీమ్‌కు దూరంగా ఉండటం మంచిది.

కొబ్బరి క్రీమ్ తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఎవరికైనా కొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండె సమస్యలు లేదా బరువు పెరగడం వంటి సమస్యలుంటే కొబ్బరి క్రీమ్ తినడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అంటే డైట్ ను ఫాలో అవుతుంటే పరిమిత పరిమాణంలో తినండి. ఏదైనా అనారోగ్య పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.