
వంటగదిని శుభ్రంగా ఉంటేనే.. ఇంటి సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి కిచెన్ ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. వంటింటిని క్లీన్ చేయడం అంత సులువైన విషయం కాదు. ఇది ఆడవాళ్లకు నిజంగానే సవాలుగా మారుతుంది. వంట గది శుభ్రం చేయాలంటే చాలా సమయం పడుతుంది.

ఇంట్లో పాత బట్టలు ఖచ్చితంగా ఉంటాయి. అవి వేటికీ పనికి రావని చాలా మంది పడేస్తూ ఉంటారు. కానీ వీటిని ఉపయోగించి కిచెన్ శుభ్రం చేసుకోవచ్చు. వీటిని చిన్న ముక్కలుగా చేసి కిచెన్‌ని క్లీన్ చేయవచ్చు.

వంట గదిలో సింక్ చాలా ముఖ్యం. సింక్‌ని ఎప్పటికప్పుడు నీటిగా ఉంచుకోవాలి. లేదంటే దుర్వాసన వస్తూ ఉంటుంది. దుర్వాసన రాకుండా ఉండాలంటే నిమ్మరసం, బేకింగ్ సోడా వంటివి ఉపయోగిస్తే చెడు వాసన రాకుండా ఉంటుంది.

కిచెన్‌లో మిగిలిపోయిన అన్నం, కూరలను ఎప్పటికప్పుడు పారవేస్తూ ఉండాలి. ఫ్రిజ్‌లో కూడా అవసరం అయిన వస్తువులు మాత్రమే ఉంచాలి. అదే విధంగా గ్యాస్ స్టవ్‌ని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అప్పటికప్పుడు పడిన కూరల మరకలు వెంటనే తుడిచేస్తే నీటిగా ఉంటుంది.

అదే విధంగా గ్యాస్ స్టవ్ బర్నర్స్‌ని కూడా వారంలో ఒకసారైనా క్లీన్ చేయాలి. అప్పడే మంట పెద్దగా తగులుతుంది. గ్యాస్ స్టవ్ దగ్గర ఉన్న టైల్స్‌ని కూడా వారానికి ఒకసారైనా బేకింగ్ సోడా ఉపయోగించి తుడిస్తే వెంటనే మరకలు పోతాయి. లేదంటే జిడ్డుగా మారి మొండిబారిపోతుంది.