Prasad Behara: అసభ్యకరంగా తాకాడు.. కో- స్టార్ ఫిర్యాదుతో అరెస్ట్ అయిన ప్రసాద్ బెహరా

|

Dec 18, 2024 | 8:51 PM

యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ప్రసాద్ బెహరాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది. కొన్ని నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రసాద్ ను రిమాండ్ కు తరలించారు పోలీసులు.

1 / 5
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమ టాలెంట్ నమ్ముకుని ఎంతోమంది ప్రూవ్ చేసుకొని మంచి గుర్తింపు సాధించుకున్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్ టైమ్స్‌లో షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి గుర్తింపు సాధించి సినిమాల్లో అవకాశాలు అందుకున్న నటులు కూడా చాలామంది ఉన్నారు.

2 / 5
అయితే గుర్తింపు వస్తున్న టైమ్ లోనే చాలామంది కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటారు. అవి ఫాస్ట్ గా వెళుతున్న వారి కెరియర్ కి బ్రేకులు వేస్తాయి. ఇదివరకే చాలా మంది యూట్యూబర్స్ లైంగిక వేధింపులు కేసులో జైలు పాలు అయ్యారు. ఇప్పుడు తాజాగా మరో యూట్యూబర్ కూడా అరెస్ట్ అయ్యాడు.

3 / 5
సహచర నటిని వేధించిన కేసులో బెహరా ప్రసాద్‌ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రసాద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓ వెబ్‌సిరీస్‌ షూటింగ్‌ సమయంలో ప్రసాద్‌ తనకు పరిచయమయ్యాడని యువతి చెబుతోంది. షూట్‌లో భాగంగా అసభ్యంగా ప్రవర్తించాడని.. నిలదీయడంతో క్షమాపణలు చెప్పాడంటోంది.

4 / 5
ఈ నెల11న షూటింగ్‌ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్‌ అందరి ముందు తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రసాద్‌ను కోర్టులో హాజరుపర్చగా .. 14 రోజుల రిమాండ్‌ విధించారు. నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

5 / 5
కేవలం వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా రీసెంట్ గా కమిటీ కుర్రాళ్ళు సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలాంటి టైంలో ఇలా అరెస్ట్‌ కావడం అనేది ప్రసాద్ కెరియర్‌కి ఒక చెరిగిపోని మచ్చ అని చెబుతున్నారు