
ఇవానా.. అసలు పేరు అలీనా షాజీ, ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 2000 ఫిబ్రవరి 25న కేరళలోని చంగనాచెరిలో ముస్లిం కుటుంబంలో జన్మించింది. తిరువనంతపురంలోని కేరళ యూనివర్సిటీ నుంచి బి.కామ్ పట్టా పొందింది. ప్రధానంగా మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తుంది ఈ బ్యూటీ.

బాల నటిగా మలయాళ చిత్రాల్లో ఈ అమ్మడి కెరీర్ మొదలైంది. 2012లో "మాస్టర్స్"లో సహాయ పాత్రతో మొదలుపెట్టింది. ఆ తర్వాత "రాణి పద్మిని" (2015), "అనురాగ కరిక్కిన్ వెళ్ళం" (2016)లో నటించింది.

దర్శకుడు బాలా ఆమె నటనను గుర్తించి, 2018లో తమిళ చిత్రం "నాచియార్"లో జ్యోతిక, జి.వి. ప్రకాష్ కుమార్‌లతో కలిసి కీలక పాత్రలో నటించే అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం తెలుగులో "ఝాన్సీ"గా డబ్ అయింది. తమిళ ప్రేక్షకులకు సులభంగా పలికేందుకు తన పేరును ఇవానాగా మార్చుకుంది.

2022లో "లవ్ టుడే"లో నిఖిత పాత్రతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు పొందింది. ఈ చిత్రం భారీ వసూళ్లతో విజయం సాధించి, తెలుగులో 2022 నవంబర్ 25న విడుదలైంది. ఈ సినిమాతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారింది.

ఇక ఇప్పుడు సింగిల్ అనే సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవానా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలు, అప్‌డేట్‌లను అభిమానులతో పంచుకుంటుంది.