
బ్యాచిలర్ సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది దివ్యభారతి. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఇందులో రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయి నటించింది. దాంతో ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

తొలి సినిమాతోనే ఈ అమ్మడు కుర్రాళ్ళ ద్రియం గర్ల్ గా మారిపోయింది. బ్యాచిలర్ చిత్రంలో సుబ్బలక్ష్మీ పాత్రకు తన నటనతో ప్రాణం పోసింది. ఇందులో జీవీ ప్రకాష్ హీరోగా నటించాడు. ఆ తర్వాత కన్నడలో పలు చిత్రాల్లో నటించింది ఈ అమ్మడు.

1992 జనవరి 28న కోయంబత్తూరులో జన్మించింది దివ్యభారతి. బ్యాచిలర్ మూవీ తర్వాత జర్నీ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇక ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లో కలిపి ఏకంగా ఐదు సినిమాలు లైన్‌లో పెట్టింది. ఆచితూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.

సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘G.O.A.T -Greatest Of All Time’ అనే చిత్రంతో దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. కానీ ఈ సినిమా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది ఇంకా అనౌన్స్ చేయలేదు.

అలాగే తమిళంలో ఇటీవలే విజయ్ సేతుపతి నటించిన మహారాజా చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.