Yash: యశ్ ప్లానింగ్‌పై అభిమానుల నిరుత్సాహం.. ఎందుకు ఇలా చేస్తున్నారు

Edited By: Phani CH

Updated on: Sep 22, 2025 | 9:33 PM

ఒక్క ప్యాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ వస్తే హీరోలు ఇంత కంగారు పడతారా..? 1000 కోట్ల సినిమా ఒక్కటి వస్తేనే ఇంతగా టెన్షన్ పడిపోతారా..? కెరీర్ విషయంలో ప్లానింగ్ పూర్తిగా గాడి తప్పుతుందా..? కన్ఫ్యూజన్‌లో ఏం చేస్తున్నాం అనేది కూడా మరిచిపోతుంటారా..? ఇంతకీ ఇవన్నీ ఎవరి విషయంలో జరిగాయి అనుకుంటున్నారా..? లేట్ ఎందుకు చూడండి..

1 / 5
కొందరు హీరోలకు కొన్ని సినిమాలు ఐకానిక్‌గా అలా ఉండిపోతాయి. ప్రభాస్‌కు బాహుబలి.. అల్లు అర్జున్‌కు పుష్ప.. యశ్‌కు కేజియఫ్. ఈ సినిమాలతో తమ ఇండస్ట్రీలో కాదు.. పక్క ఇండస్ట్రీల్లోనూ జెండా పాతారు వీళ్ళంతా.

2 / 5
ఈ ఇమేజ్‌ను బట్టే వాళ్ల కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు. యశ్ కూడా అంతే. కాకపోతే కేజియఫ్ తర్వాత ఈయనకు క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది.

3 / 5
కేజియఫ్ 2 వచ్చి మూడున్నరేళ్లైంది.. ఈ గ్యాప్‌లో సలార్ చేసి ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్. కానీ యశ్ మాత్రం మరో సినిమా చేయలేదు. టాక్సిక్ షూట్ నడుస్తున్నా కానీ ఇది రీ షూట్స్ జరుగుతున్నాయనే టాక్ ఎక్కువైపోయింది.

4 / 5
ఇప్పటికే ఈ సినిమాపై 100 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టారు కేవిఎన్ ప్రొడక్షన్స్. టాక్సిక్ షూట్ విషయంలో కన్ఫ్యూజన్ ఉందని.. రెండు మేజర్ షెడ్యూల్స్ షూట్ చేసి పక్కనబడేసారని తెలుస్తుంది.

5 / 5
గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూట్ మొదలై ఆర్నెళ్లైనా కనీసం సగం కూడా కాలేదు. మరోవైపు రామాయణ్‌లో రావణుడిగా నటిస్తున్నారు యశ్. ఏదేమైనా కేజియఫ్ 2 లాంటి సినిమా తర్వాత ఇంత బ్రేక్ కెరీర్‌కు మంచిది కాదేమో..?