
హాలీవుడ్ ప్రముఖ హీరోయిన్.. వండర్ వుమెన్ మూవీ ఫేమ్ గాల్ గాడోట్ శుభవార్త చెప్పింది. తాను నాలుగోసారి అమ్మగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు గాల్ గాడోట్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు గాల్ గాడోట్ తెలిపింది. అంతేకాదు తన పాపకు ఓరి అని నామకరణం చేసినట్లు ఈ అందాల తార పేర్కొంది.

'ప్రెగ్నెన్సీ అంత ఈజీ కాదు. అయితే నీ రాకతో మా జీవితాల్లోకి కొత్త వెలుగు వచ్చింది. నీ పేరుకు తగినట్టే నీ లైఫ్‌లో కూడా వెలుగులు చిమ్మాలి' అని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు గాల్ గాడోట్.

ఓరి అంటే హెబ్రూ భాషలో నా క్రాంతి అని అర్ధమట. ఇప్పుడు తన కూతురుకు కూడా ఇదే పేరు పెట్టింది వండర్ వుమెన్. ల్ గాడోట్ 2008లో జారోన్ వార్సానోను ప్రేమ వివాహం చేసుకుంది. ఇప్పటికే వీరిద్దరికి ఆల్మా(12), మాయా(6), డేనీయోలా(2) అనే ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్(2009) సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన గాల్ గాడోట్ వండర్ ఉమెన్‌తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది. తాజాగా ఆమె నటించిన హార్ట్ ఆఫ్ స్టోన్ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.