- Telugu News Photo Gallery Cinema photos Will Thaman and Devi Sri Prasad be alerted by warning bells in Tollywood?
Music Directors: టాలీవుడ్‌లో వార్నింగ్ బెల్స్… తమన్, దేవీ అలర్ట్ అవుతారా?
టాలీవుడ్‌లో సంగీత దర్శకులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. పేరుకు చేతినిండా సినిమాలు ఉన్నట్టుగానే కనిపిస్తున్నా... కెరీర్ విషయంలో వార్నింగ్ బెల్స్ మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంతకీ మ్యూజిక్ డైరెక్టర్లను టెన్షన్ పెడుతున్న అంశాలేంటి..? ఈ స్టోరీలో చూద్దాం.
Updated on: Apr 17, 2025 | 6:00 PM

ప్రజెంట్ టాలీవుడ్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే తమన్, దేవీ శ్రీ ప్రసాద్, భీమ్స్ పేర్లే ముందు గుర్తుకు వస్తాయి. వీళ్లతో పాటు కీరవాణి, మణిశర్మ, మిక్కీ జే మేయర్ లాంటి సీనియర్స్ కూడా అప్పుడప్పుడు తమ ట్యూన్స్ వినిపిస్తున్నారు. ఇన్నాళ్లు వీళ్ల మధ్యే పోటి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.

పాన్ ఇండియా ట్రెండ్‌లో పరభాషా సంగీత దర్శకులు కూడా టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. ఇప్పటికే అనిరుధ్, జీవి ప్రకాష్ లాంటి సంగీత దర్శకులకు టాలీవుడ్‌లోనూ హిట్స్ పడ్డాయి. వీళ్ల ఆల్బమ్స్‌కు మిలియన్ల కొద్ది వ్యూస్ అదే స్థాయిలో ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వీళ్ల పాటు సామ్ సీయస్, సంతోష్ నారాయణన్ కూడా తమ మార్క్ చూపిస్తున్నారు.

ఇప్పుడు కొత్తగా కన్నడ సంగీత దర్శకులు కూడా టాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నారు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో రవి బస్రూర్‌కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు అజనీష్ లోకనాథ్ కూడా టాలీవుడ్ మీద సీరియస్‌గా ఫోకస్ చేస్తున్నారు.

పెద్దితో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. యంగ్ మ్యూజిషయన్ సాయి అభయంకర్ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఇంత మంది పరభాష సంగీత దర్శకులు టాలీవుడ్ ఫోకస్ చేస్తుండటంతో తెలుగు మ్యూజీషియన్స్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ప్రస్తుతానికి మన సంగీత దర్శకులు ఫుల్ బిజీగానే కనిపిస్తున్నా.. భవిష్యత్తుల్లో కొత్త వచ్చిన వాళ్లకు అవకాశాలు తన్నుకుపోతే ఇబ్బందులు తప్పవు. అందుకే ఇప్పటి నుంచే కాస్త అలర్ట్‌గా ఉంటే బెటర్ అన్న సిగ్నల్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తున్నాయి.




