Devil: ‘డెవిల్’ కౌంట్‌డౌన్ స్టార్ట్.. నందమూరి హీరోకి హిట్ దక్కేనా..
కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందంటూ స్పీడ్ పెంచుతున్నారు నందమూరి కల్యాణ్‌రామ్. ఆపరేషన్ టైగర్ హంట్ అంటూ రాబోయే సినిమా మీద ట్రైలర్‌తో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఇంతకీ డెవిల్ ట్రైలర్ ఎలా ఉంది? మర్డర్ మిస్టరీకి, సీక్రెట్ ఏజెన్సీకి సంబంధం ఏంటి? శవాలు సాక్ష్యాలు చెప్పడం ఎక్కడైనా చూశారా? అంటూ ఇంట్రస్టింగ్ డైలాగులతో సాగింది డెవిల్ ట్రైలర్ కట్. పీరియాడిక్ కంటెంట్‌తో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆ విషయాలను క్లియర్‌గా చూపించే ప్రయత్నం చేశారు డైరక్టర్, ప్రొడ్యూసర్ అభిషేక్ నామా.